Last Updated:
ఒకే భూమిని ఇద్దరికి అమ్మితే అసలు యజమాని ఎవరు? ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారా.. లేక తర్వాత కొనుగోలు చేసినవారా? భూమి కొనే ముందు ఏ డాక్యుమెంట్లు తప్పనిసరిగా చెక్ చేయాలి? కోర్టు కేసులు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి?
భూములు, ఇళ్లు, ప్లాట్ల కొనుగోలు జీవితంలో అత్యంత విలువైన పెట్టుబడుల్లో ఒకటి. అయితే సరైన పత్రాలు పరిశీలించకుండా కొనుగోలు చేస్తే భారీ ఆర్థిక నష్టం, కోర్టు వివాదాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించడం వంటి మోసాలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం ఏమి చెబుతోంది? అసలు యజమాని ఎవరు? భూమి కొనుగోలు చేసే ముందు ఏ పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి? ఒకవేళ మోసపోతే ఏం చేయాలి? వంటి కీలక అంశాలను తెలుసుకోవడం ప్రతి కొనుగోలుదారుడికి అవసరం.

