సాధారణంగా మార్కెట్లో QLED డిస్ప్లే సాంకేతికత కలిగిన 43 అంగుళాల స్మార్ట్ టీవీల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ VW స్మార్ట్ టీవీ అసలు ఎంఆర్పీ . 29,999 కాగా, ప్రస్తుతం నడుస్తున్న సేల్లో ఏకంగా 52% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత వినియోగదారులు దీనిని కేవలం రూ. 14,499 కే సొంతం చేసుకోవచ్చు. గత నెలలోనే ఏకంగా 1,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోవడం ఈ టీవీకి ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది. వినియోగదారులు దీనికి 4.0 స్టార్ రేటింగ్ (16,086 కంటే ఎక్కువ రివ్యూలు) ఇవ్వడం విశేషం.
