Last Updated:
ప్రపంచంలోని అతిపెద్ద మీడియా సంస్థలను వెనక్కి నెట్టి ఓ భారతీయ న్యూస్ నెట్‌వర్క్ నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది. 376 మిలియన్ యూనిక్ విజిటర్స్, 6 బిలియన్ యూట్యూబ్ వ్యూస్, కోట్లాది సోషల్ మీడియా వీక్షణలతో ఈ అరుదైన ఘనత ఎలా సాధ్యమైంది? ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎవరిని వెనక్కి నెట్టింది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత్‌లోనే అతిపెద్ద వార్తా నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన నెట్‌వర్క్18 (Network18) ఇప్పుడు మరో కీలక మైలురాయిని అందుకుంది. తాజా Comscore గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ న్యూస్ & ఇన్ఫర్మేషన్ విభాగంలో అత్యధిక యూనిక్ విజిటర్లను నమోదు చేసిన సంస్థగా నెట్‌వర్క్18 నిలిచింది. దీంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా డిజిటల్ వార్తల రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

