Last Updated:
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. అలాంటి వాటిలో దోసకాయ రోటి పచ్చడి ఒకటి. ఇది పుల్లగా, కారం కారం రుచితో పాటు పల్లీల ఫ్లేవర్ కలవడంతో మరింత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం.
ఇంట్లో ఆవకాయ, ఉసిరికాయ, మామిడికాయ వంటి నిల్వ పచ్చళ్లు ఉన్నా కూడా చాలా మంది తాజాగా చేసే రోటి పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా టమాటా, గోంగూర, దోసకాయ వంటి పచ్చళ్లకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. అలాంటి వాటిలో దోసకాయ రోటి పచ్చడి ఒకటి. ఇది పుల్లగా, కారం కారం రుచితో పాటు పల్లీల ఫ్లేవర్ కలవడంతో మరింత టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకునే ఈ పచ్చడిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

