Last Updated:
Michelin: ప్రపంచ ప్రసిద్ధ టైర్ టెక్నాలజీ దిగ్గజం ‘మిచెలిన్’ (Michelin) భారత మార్కెట్లోకి తన సరికొత్త ప్రీమియం టైర్ ‘మిచెలిన్ ప్రైమసీ 5’ (MICHELIN Primacy 5) ను అధికారికంగా విడుదల చేసింది.
సెడాన్, ఎస్‌యూవీ (SUV) మోడళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ టైర్, మిచెలిన్ సంస్థ నుండి భారతదేశంలోనే తయారైన (Made in India) మొదటి ప్యాసింజర్ కార్ టైర్ కావడం విశేషం. చెన్నైలో జరిగిన లాంచ్ కార్యక్రమంలో మిచెలిన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శంతను దేశ్‌పాండే మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రీమియం వాహనాల విపణి వేగంగా విస్తరిస్తోందని, భారతీయ డ్రైవర్ల అవసరాలు, స్థానిక రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ టెక్నాలజీతో ఈ టైర్లను స్వదేశంలోనే తయారు చేసినట్లు వెల్లడించారు.
ఈ టైర్లను భారత్‌లోని ప్రముఖ కార్లపై విస్తృతంగా పరీక్షించి, స్వతంత్ర టెస్టింగ్ ఏజెన్సీల ద్వారా ధ్రువీకరించారు. భారతీయ రోడ్లకు అత్యంత అనుకూలంగా ఉండేలా దీని రబ్బర్ కాంపౌండ్స్, త్రెడ్ ప్యాటర్న్‌ను డిజైన్ చేశారు. ఎవర్‌ట్రెడ్ (EverTread), ఎవర్‌గ్రిప్ (EverGrip) టెక్నాలజీల కారణంగా టైర్ అరిగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ బ్రేకింగ్ సామర్థ్యం తగ్గదు. వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ వేస్తే, తోటి పోటీ టైర్లతో పోలిస్తే ఇది తడి రోడ్లపై (Wet Braking) కొత్తగా ఉన్నప్పుడు 8 మీటర్లు, అరిగిపోయినప్పుడు 9 మీటర్ల ముందే ఆగుతుంది. డ్రై రోడ్లపై 4 మీటర్ల తక్కువ దూరంలోనే వాహనాన్ని సురక్షితంగా నిలుపుతుంది. ఇది గత ప్రైమసీ 4ST మోడల్ కంటే 8% ఎక్కువ మైలేజ్ (టైర్ లైఫ్) ఇస్తుంది.
ధ్వనిని తగ్గించే (Noise Attenuation) ప్రత్యేక త్రెడ్ డిజైన్ వల్ల ప్రయాణం అత్యంత ప్రశాంతంగా, సుఖవంతంగా ఉంటుంది. ఇతర పోటీ టైర్లతో పోలిస్తే ఇది 9% మెరుగైన కంఫర్ట్ స్కోర్‌ను నమోదు చేసింది.
పెట్రోల్/డీజిల్ (ICE), హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ (EV) వాహనాలు రెండింటికీ ఇది సరిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాల ఎక్కువ బరువు, టార్క్‌ను తట్టుకునేలా రూపుదిద్దుకుంది. ఎనర్జీ ఎఫిషియన్సీలో 6.5% పురోగతి సాధించడం వల్ల ఐసీఈ వాహనాల్లో ఇంధన పొదుపు, ఈవీలలో ఎక్కువ బ్యాటరీ రేంజ్ లభిస్తాయి.
ఆవిష్కరణలు మరియు ప్రతిభకు గానూ ‘టైర్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ అవార్డ్స్’లో ఈ టైర్ ప్రసిద్ధ “టైర్ ఆఫ్ ది ఇయర్ 2025” కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ఆగస్టు 2026 నుంచి ‘మిచెలిన్ ప్రైమసీ 5’ టైర్లు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మిచెలిన్ టైర్స్, సర్వీస్ స్టోర్లు దాదాపు 800 మందికి పైగా అధీకృత డీలర్ల వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
Hyderabad,Telangana

