ప్రభన్యూస్

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లో రూ.5,000 జమ?.. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే! | బిజినెస్


Last Updated:

PIB Fact Check: సోషల్ మీడియాలో రేషన్ కార్డుదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5,000 జమ చేస్తారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకమని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB స్పందించి, వైరల్ వీడియోలోని వాదన పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది.

News18
News18

సోషల్ మీడియాలో మరోసారి కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈసారి రేషన్ కార్డుదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5,000 జమ చేస్తారని పేర్కొంటూ ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నిజంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB Fact Check స్పష్టత ఇచ్చింది.

PIB Fact Check వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘aapka_bhai77’ అనే ఖాతా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన డీప్‌ఫేక్ (Deepfake) వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో దేశంలోని అన్ని రేషన్ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.5,000 జమ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

అయితే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ రేషన్ కార్డుదారులందరికీ రూ.5,000 జమ చేసేలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని వెల్లడించింది. వైరల్ అవుతున్న వీడియోలో చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అలాగే డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల వీడియోలను మార్చి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్నాయని PIB హెచ్చరించింది. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా ఒకసారి ధృవీకరించుకోవాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయాలు లేదా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక సమాచారం తెలుసుకోవాలంటే MyScheme పోర్టల్‌ను మాత్రమే సందర్శించాలని PIB సూచించింది. ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమాచారం అధికారిక వేదికల ద్వారానే తెలుసుకోవాలని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో అనుమానాస్పదంగా కనిపించే ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలు ఎదురైతే వాటిని వెంటనే PIB Fact Checkకు పంపించాలని ప్రజలను కోరింది. వాటిని పరిశీలించి నిజానిజాలను వెల్లడిస్తామని తెలిపింది. ఇందుకోసం +91 8799711259 వాట్సాప్ నంబర్‌తో పాటు factcheck@pib.gov.in ఇమెయిల్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

ఇది కూడా చదవండి: Gold Price: కరుగుతున్న వెండి కొండ.. పడిపోతున్న పసిడి ధరలు.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్!

ప్రస్తుతం డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరిగే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆకర్షణీయమైన ఆఫర్లు లేదా నగదు జమ అవుతుందనే సందేశాలను నమ్మే ముందు అధికారిక ప్రకటన వచ్చిందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 August 2026, 11:06 am Digital Edition : Prabhanews
Ration Card: రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లో రూ.5,000 జమ?.. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే! | బిజినెస్

Last Updated:Aug 02, 2026 10:58 AM ISTPIB Fact Check: సోషల్ మీడియాలో రేషన్ కార్డుదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5,000 జమ చేస్తారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకమని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB స్పందించి, వైరల్ వీడియోలోని వాదన పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది.
News18సోషల్ మీడియాలో మరోసారి కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈసారి రేషన్ కార్డుదారులందరి బ్యాంకు ఖాతాల్లో రూ.5,000 జమ చేస్తారని పేర్కొంటూ ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నిజంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB Fact Check స్పష్టత ఇచ్చింది.PIB Fact Check వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో 'aapka_bhai77' అనే ఖాతా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన డీప్‌ఫేక్ (Deepfake) వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో దేశంలోని అన్ని రేషన్ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.5,000 జమ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.
#Instagram अकाउंट 'aapka_bhai77' द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी का एक डीपफेक वीडियो साझा कर यह दावा किया जा रहा है कि सभी राशन कार्ड धारकों के खातों में ₹5,000 की राशि भेजी जाएगी।#PIBFactCheck
❌ यह दावा फर्जी है।✅ प्रधानमंत्री @narendramodi या केंद्र सरकार द्वारा ऐसी… pic.twitter.com/0ETA87hAUN— PIB Fact Check (@PIBFactCheck) August 1, 2026అయితే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని PIB Fact Check స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ రేషన్ కార్డుదారులందరికీ రూ.5,000 జమ చేసేలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని వెల్లడించింది. వైరల్ అవుతున్న వీడియోలో చేసిన వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. అలాగే డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల వీడియోలను మార్చి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇటీవల పెరుగుతున్నాయని PIB హెచ్చరించింది. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా ఒకసారి ధృవీకరించుకోవాలని సూచించింది.కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయాలు లేదా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక సమాచారం తెలుసుకోవాలంటే MyScheme పోర్టల్‌ను మాత్రమే సందర్శించాలని PIB సూచించింది. ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి సమాచారం అధికారిక వేదికల ద్వారానే తెలుసుకోవాలని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో అనుమానాస్పదంగా కనిపించే ఫోటోలు, వీడియోలు లేదా సందేశాలు ఎదురైతే వాటిని వెంటనే PIB Fact Checkకు పంపించాలని ప్రజలను కోరింది. వాటిని పరిశీలించి నిజానిజాలను వెల్లడిస్తామని తెలిపింది. ఇందుకోసం +91 8799711259 వాట్సాప్ నంబర్‌తో పాటు factcheck@pib.gov.in ఇమెయిల్‌ను కూడా అందుబాటులో ఉంచింది.ఇది కూడా చదవండి: Gold Price: కరుగుతున్న వెండి కొండ.. పడిపోతున్న పసిడి ధరలు.. గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్!ప్రస్తుతం డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలు, ప్రభుత్వ పథకాల పేరుతో జరిగే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆకర్షణీయమైన ఆఫర్లు లేదా నగదు జమ అవుతుందనే సందేశాలను నమ్మే ముందు అధికారిక ప్రకటన వచ్చిందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారం, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.Location :Hyderabad,TelanganaFirst Published :Aug 02, 2026 10:58 AM ISTమరింత చదవండి

Source link