తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాలు, సంఘటనలు, నమ్మలేని అనుభవాలు పంచుకుంది సమీరా రెడ్డి. 2005లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ‘నరసింహుడు’, ఆ తర్వాత మళ్ళీ 2006లో ‘అశోక్’ చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, వీరిద్దరి మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

