ప్రభన్యూస్

Nani The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ క్రేజీ అప్‌డేట్.. ఇది కదా కావాల్సింది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కోరుకునే క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది.

News18
News18

న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘ద ప్యారడైజ్’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే నాని.. ఈ సినిమా కోసం తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి సారించడంతో ఇతర ప్రాజెక్టులకు కాస్త విరామం ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

తాజాగా ‘ద ప్యారడైజ్’ టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 06వ తేదీ (వచ్చే గురువారం) నాడు 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాలకు ఈ టీజర్ ద్వారా తెరపడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ పనుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో మూవీని ఆగస్టు నెలకు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆగస్టు నుంచి కూడా సినిమా వాయిదా పడవచ్చనే ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో, రాబోయే టీజర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ అనే మాస్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అనిరుధ్ మాస్ బీట్స్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని ఊరమాస్ లుక్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 August 2026, 11:59 am Digital Edition : Prabhanews
Nani The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ క్రేజీ అప్‌డేట్.. ఇది కదా కావాల్సింది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 01, 2026 11:35 AM ISTన్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'ద ప్యారడైజ్' కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కోరుకునే క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. News18న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'ద ప్యారడైజ్' కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే నాని.. ఈ సినిమా కోసం తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి సారించడంతో ఇతర ప్రాజెక్టులకు కాస్త విరామం ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.తాజాగా 'ద ప్యారడైజ్' టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 06వ తేదీ (వచ్చే గురువారం) నాడు 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, సినిమా రిలీజ్ డేట్‌పై ఉన్న అనుమానాలకు ఈ టీజర్ ద్వారా తెరపడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ పనుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో మూవీని ఆగస్టు నెలకు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆగస్టు నుంచి కూడా సినిమా వాయిదా పడవచ్చనే ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో, రాబోయే టీజర్‌తో పాటు కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఈ చిత్రంలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఆయా షేర్' అనే మాస్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అనిరుధ్ మాస్ బీట్స్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని ఊరమాస్ లుక్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Aug 01, 2026 11:35 AM ISTమరింత చదవండి

Source link