కార్తి (Karthi) హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో 2022లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వల్ గా ‘సర్దార్2’ (Sardar2) రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో రాశీఖన్నా, రజీషా విజయన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.
Source link
Sardar 2 Teaser: కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ సీన్లురా మావ
