ధరల గణాంకాలను పరిశీలిస్తే ఈ తగ్గుదల ఎంత పెద్దదో స్పష్టంగా తెలుస్తుంది. మే 10న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,52,350 ఉండగా, జూన్ 28 నాటికి అది రూ.1,43,950కు పడిపోయింది. అంటే కేవలం కొన్ని వారాల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.8,400 తగ్గింది. వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. మే 10న కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, జూన్ 28వ తేదీ నాటికి అది రూ.2,45,000కు చేరింది. అంటే కిలో వెండిపై ఏకంగా రూ.35,000 మేర తగ్గుదల నమోదైంది. ఇంత తక్కువ సమయంలో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పడిపోవడం సామాన్య కొనుగోలుదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

