“ఉదాహరణకు రూ.2,10,000 విలువైన 3కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే వినియోగదారు సుమారు రూ.21,000 డౌన్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వ బ్యాంకులు మిగిలిన మొత్తానికి రుణం ఇస్తాయి. బ్యాంకు అంచనాల ఆధారంగా సుమారు రూ.1,89,000 నుంచి రూ.1,98,000 వరకు రుణం లభించవచ్చు. ఈఎంఐ నెలకు సుమారు రూ.2,100 నుంచి రూ.2,150 వరకు ఉండొచ్చు. వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి రూ.78,000 సబ్సిడీ వస్తుంది. ప్రతి నెల విద్యుత్ బిల్లు చెల్లించే బదులు, అదే మొత్తాన్ని సోలార్ సిస్టమ్ సొంతం చేసుకోవడానికి పెట్టుబడిగా పెట్టవచ్చు. వినియోగదారులు ఈఎంఐని తమ నెలవారీ విద్యుత్ బిల్లుగా భావించవచ్చు” అని సోలార్ ఎక్స్పర్ట్ ఆదిత్య ప్రభాకర్ వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)

