ప్రభన్యూస్

Hero Nani: 1000 మంది డాన్సర్లతో ది ప్యారడైజ్ ఐటెం సాంగ్‌.. కీర్తి సురేష్ ఎంట్రీతో రచ్చ రంబోలా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమాలో థియేటర్స్ హోరెత్తిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట.

News18
News18

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్‌’ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అంచనాలతో ఈ చిత్రంపై ముందు నుంచే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, అప్ డేట్స్, పాటలు ప్రేక్షక లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ నంబర్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిరుధ్.. ఈ చిత్రం కోసం ఒక అదిరిపోయే మాస్ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేశారట. ఈ పాట కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దించితే బాగుంటుందని మేకర్స్ భావించారు. ఈ క్రమంలోనే ‘దసరా’, ‘నేను లోకల్’ చిత్రాల్లో నానితో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో నాని, కీర్తి సురేష్ చాలా మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. నాని స్వయంగా అడగటంతో, తనకున్న చనువు కొద్దీ కీర్తి ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి వెంటనే ఓకే చెప్పేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ స్పెషల్ సాంగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కించడానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో అత్యంత భారీ ఖర్చుతో ఒక ప్రత్యేకమైన సెట్‌ను నిర్మించారు. ఈ క్రేజీ సాంగ్ షూటింగ్ ఈ సెట్స్‌లోనే పూర్తి చేస్తారట. సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో నాని, కీర్తి సురేష్‌లపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. దసరా సినిమాలో ‘వెన్నెల’ పాత్రలో ఒదిగిపోయిన కీర్తి, ఇప్పుడు గ్లామరస్ స్పెషల్ సాంగ్‌లో ఎలా మెరుస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడం, పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత, మేకర్స్ అతి త్వరలోనే ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 4:03 pm Digital Edition : Prabhanews
Hero Nani: 1000 మంది డాన్సర్లతో ది ప్యారడైజ్ ఐటెం సాంగ్‌.. కీర్తి సురేష్ ఎంట్రీతో రచ్చ రంబోలా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 30, 2026 3:41 PM ISTనేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమాలో థియేటర్స్ హోరెత్తిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట. News18నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్‌’ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అంచనాలతో ఈ చిత్రంపై ముందు నుంచే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, అప్ డేట్స్, పాటలు ప్రేక్షక లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ నంబర్స్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిరుధ్.. ఈ చిత్రం కోసం ఒక అదిరిపోయే మాస్ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేశారట. ఈ పాట కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దించితే బాగుంటుందని మేకర్స్ భావించారు. ఈ క్రమంలోనే 'దసరా', 'నేను లోకల్' చిత్రాల్లో నానితో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో నాని, కీర్తి సురేష్ చాలా మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. నాని స్వయంగా అడగటంతో, తనకున్న చనువు కొద్దీ కీర్తి ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి వెంటనే ఓకే చెప్పేసిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.ఈ స్పెషల్ సాంగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, స్క్రీన్ పై విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కించడానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లో అత్యంత భారీ ఖర్చుతో ఒక ప్రత్యేకమైన సెట్‌ను నిర్మించారు. ఈ క్రేజీ సాంగ్ షూటింగ్ ఈ సెట్స్‌లోనే పూర్తి చేస్తారట. సుమారు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో నాని, కీర్తి సురేష్‌లపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. దసరా సినిమాలో 'వెన్నెల' పాత్రలో ఒదిగిపోయిన కీర్తి, ఇప్పుడు గ్లామరస్ స్పెషల్ సాంగ్‌లో ఎలా మెరుస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం కావడం, పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత, మేకర్స్ అతి త్వరలోనే ఈ చిత్రం కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link