Last Updated:
Rohan Murty: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు.. ఒకే వారంలో ప్రపంచ స్థాయిలో అత్యున్నత గుర్తింపులు సాధిస్తే దానికి దక్కే గౌరవమే వేరు. అలాంటి ఒక అరుదైన, చారిత్రాత్మక ఘనతను ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి కుటుంబం సొంతం చేసుకుంది.
ఈ విశేషాలను నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రోహన్ మూర్తి తన పోస్ట్‌లో తమ కుటుంబంలో గత వారం జరిగిన 3 గొప్ప సంఘటనలను వివరిస్తూ ఒక చమత్కారమైన వ్యాఖ్య జోడించారు.
ఎన్.ఆర్. నారాయణ మూర్తి: ఐటీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ యార్క్ (University of York) ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇది నారాయణ మూర్తి అందుకని 40వ గౌరవ డాక్టరేట్ కావడం గమనార్హం.
సుధా మూర్తి: ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు, సామాజిక సేవకురాలు సుధా మూర్తికి ఆమె స్వస్థలమైన ఐఐటీ ధార్వాడ్ (IIT Dharwad) తొలి గౌరవ డాక్టరేట్‌ను అందించింది. విద్య, సాహిత్యం, సమాజ సేవా రంగాల్లో ఆమె చూపిన అపారమైన కృషికి గాను ఈ గౌరవం దక్కింది. ఇది ఆమెకు 24వ గౌరవ డాక్టరేట్.
డాక్టర్ శ్రీనివాస్ కులకర్ణి: సుధా మూర్తి సోదరుడు (రోహన్ మూర్తి మేనమామ), ప్రపంచ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త అయిన డాక్టర్ శ్రీనివాస్ కులకర్ణికి బ్రిటన్‌కు చెందిన రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ (RAS) అత్యున్నత ‘గోల్డ్ మెడల్’ బహుకరించింది.
Three things happened in my family over the past week.
My father (N. R. Narayana Murthy) received his 40th honorary doctorate, from the University of York. My mother (@SmtSudhaMurty) received her 24th, from IIT Dharwad. And my uncle, Shri Kulkarni (my mother’s brother), was… pic.twitter.com/WAT4xgI1oM
— Rohan N. Murty (@RohanMurty) July 28, 2026
“తల్లిదండ్రులకు 40, 24వ గౌరవ డాక్టరేట్లు వస్తే, మేనమామకు దాదాపు 200 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ లభించింది. ఈ ప్రాసెస్ మొత్తంలో నా కాంట్రిబ్యూషన్ (భాగస్వామ్యం) మాత్రం వాళ్ల ఫొటోలు తీయడమే” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చివరిగా “ఇప్పటికీ నాకు అత్యుత్తమ గురువులు వీళ్లే” అని తన తల్లిదండ్రులపై ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచారు.
ఈ పురస్కారాన్ని 1824లో తొలిసారిగా కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎడ్విన్ హబుల్, స్టీఫెన్ హాకింగ్, భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజాలు ఈ గౌరవాన్ని పొందారు. ఇప్పుడు ఆ మహనీయుల సరసన డాక్టర్ శ్రీనివాస్ కులకర్ణి స్థానం సంపాదించడం భారతీయ విజ్ఞాన రంగానికి గర్వకారణం. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Hyderabad,Telangana
Jul 29, 2026 12:17 PM IST

