ప్రభన్యూస్

Viral Video: ఒకేసారి 32 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్.. ఎవరినీ నిరాశపరచడం లేదు, ఎలా మెయిన్‌టెన్ చేస్తుందో తెలుసా..? | ట్రెండింగ్


Last Updated:

32 Boyfriends: ప్రేమలో పడటానికి నిర్దిష్ట వయసు లేదా ముందు నుంచే ఉన్న బంధం అవసరం లేదు. ఈ జనరేషన్‌లో యువతీయువకులకు ప్రేమికుడు లేదా ప్రేయసి ఉండాలనే బలమైన కోరిక ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తారా రాణి అనే 26 ఏళ్ల యువతి తన వయసుకంటే ఎక్కువ మంది ఉన్న కుర్రవాళ్లతో డేటింగ్ చేస్తోంది.

News18
News18

Viral News: సోషల్ మీడియాలో ఏ క్షణంలో ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఎప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుందో లేదా ప్రజలు ఒకరికొకరు ఎప్పుడు సవాళ్లు విసురుకోవడం మొదలుపెడతారో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి వినోదాత్మక కార్యకలాపాలు సోషల్ మీడియాలో నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. ఇదే సమయంలో ఒక యువ భారతీయ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తారా అనే 26 ఏళ్ల యువతి తనకు మొత్తం 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని బహిరంగంగా ఒప్పుకుంది. అలాగే వారందరినీ ఒకేసారి ఎలా మెయిన్‌టెన్ చేస్తుందో కూడా వివరించింది.

అందరికి తెలిసే..

ప్రేమలో పడటానికి నిర్దిష్ట వయసు గానీ, ముందే ఉన్న బంధం గానీ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో యువతీయువకులకు ప్రేమికుడు లేదా ప్రేయసి ఉండాలనే బలమైన కోరిక ఉంటోంది. తారా రాణి అనే 26 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో @tara.raani ఈ ఐడితో తనకు 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని స్వయంగా ఆమె ఒప్పుకుంది. అంతేకాదు వారందరినీ ఎలా మెయిన్‌టెన్ కూడా ఆమె చెప్పింది. ప్రజలు తరచుగా సంబంధంలో నమ్మకంగా ఉండటం గురించి మాట్లాడుతారు, కానీ నేను ఒకేసారి 32 మంది పురుషులను ప్రేమిస్తూ, వారితో సమయం గడుపుతాను.”నేను దీనికోసం ఒక మేనేజర్‌ను నియమించుకున్నాను అంటోంది. అతను అందరి ఇష్టాలు, కంఫర్ట్ టైమ్ కనుక్కొని పనులు ఒకదానితో ఒకటి కలవకుండా ఉండేలా ఒక షెడ్యూల్‌ను తయారుచేస్తాడంటోంది.

ఆమె తన బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎలా కలుస్తుంది?

అంతేకాదు తన 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ కోసం ఆమె సమయాన్ని ఎలా కేటాయిస్తుందో కూడా తార వివరించింది. ప్రతి బాయ్‌ఫ్రెండ్‌ను వారానికి రెండుసార్లు కలవడానికి ఆమె ఒక నిర్దిష్టమైన షెడ్యూల్‌ను పాటిస్తుంది. కొందరితో కేవలం రాత్రి భోజనానికి వెళ్తే, మరికొందరితో సాధారణ విహారయాత్రలకు వెళ్తుంది. అలాగే ఇంకొందరితో ఏకాంతంగా గడపడానికి సమయాన్ని ముందుగానే నిర్ణయించుకుంటుంది. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా ఉండేలా తన మేనేజర్ అందరికీ వేర్వేరు సమయాలను (స్లాట్‌లను) కేటాయిస్తారని ఆమె బహిరంగంగానే చెప్పింది. తార ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో దీనికి భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే కొందరు నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధాలను అపహాస్యం చేస్తోందని తారపై మండిపడ్డారు.

తార ఎవరు?

తార 26 ఏళ్ల యువతి ఆమె స్వస్థలం ముంబై. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. మొదట్లో ఆమెకు కేవలం నలుగురు లేదా ఐదుగురు స్నేహితులు మాత్రమే ఉండేవారు. కానీ క్రమంగా ఆమె స్నేహితుల వలయం విస్తరించింది. అయితే తార తన గురించి ఏ విషయాన్నీ ఎవరి నుంచీ దాచలేదు. ఆమె తన ప్రతి ప్రియుడితోనూ ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ, అన్ని వివరాలను పంచుకుంటుంది. తమకు సరిపోతుందని భావించేవారు కొనసాగుతారని, అలా అనిపించనివారు వేరే దారి చూసుకుంటారని తారా స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఆమె మేనేజర్ రోహన్ అనే 29 ఏళ్ల యువకుడు. గతంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసిన రోహన్, ప్రస్తుతం తారా వద్ద ఆమె పూర్తి షెడ్యూల్‌ను పర్యవేక్షిస్తూ మంచి వేతనం లభించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు.అంతేకాదు ఎక్కడ కలుసుకోవాలి (హోటల్ లేదా పార్క్) ఏ బాయ్‌ఫ్రెండ్‌ను కలవాలి అనేది కూడా రోహనే నిర్ణయించుకుంటాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 July 2026, 11:25 am Digital Edition : Prabhanews
Viral Video: ఒకేసారి 32 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్.. ఎవరినీ నిరాశపరచడం లేదు, ఎలా మెయిన్‌టెన్ చేస్తుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Jul 25, 2026 11:24 AM IST32 Boyfriends: ప్రేమలో పడటానికి నిర్దిష్ట వయసు లేదా ముందు నుంచే ఉన్న బంధం అవసరం లేదు. ఈ జనరేషన్‌లో యువతీయువకులకు ప్రేమికుడు లేదా ప్రేయసి ఉండాలనే బలమైన కోరిక ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తారా రాణి అనే 26 ఏళ్ల యువతి తన వయసుకంటే ఎక్కువ మంది ఉన్న కుర్రవాళ్లతో డేటింగ్ చేస్తోంది.
News18Viral News: సోషల్ మీడియాలో ఏ క్షణంలో ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఎప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తుందో లేదా ప్రజలు ఒకరికొకరు ఎప్పుడు సవాళ్లు విసురుకోవడం మొదలుపెడతారో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి వినోదాత్మక కార్యకలాపాలు సోషల్ మీడియాలో నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి. ఇదే సమయంలో ఒక యువ భారతీయ మహిళకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.తారా అనే 26 ఏళ్ల యువతి తనకు మొత్తం 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని బహిరంగంగా ఒప్పుకుంది. అలాగే వారందరినీ ఒకేసారి ఎలా మెయిన్‌టెన్ చేస్తుందో కూడా వివరించింది.అందరికి తెలిసే..ప్రేమలో పడటానికి నిర్దిష్ట వయసు గానీ, ముందే ఉన్న బంధం గానీ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో యువతీయువకులకు ప్రేమికుడు లేదా ప్రేయసి ఉండాలనే బలమైన కోరిక ఉంటోంది. తారా రాణి అనే 26 ఏళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో @tara.raani ఈ ఐడితో తనకు 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని స్వయంగా ఆమె ఒప్పుకుంది. అంతేకాదు వారందరినీ ఎలా మెయిన్‌టెన్ కూడా ఆమె చెప్పింది. ప్రజలు తరచుగా సంబంధంలో నమ్మకంగా ఉండటం గురించి మాట్లాడుతారు, కానీ నేను ఒకేసారి 32 మంది పురుషులను ప్రేమిస్తూ, వారితో సమయం గడుపుతాను."నేను దీనికోసం ఒక మేనేజర్‌ను నియమించుకున్నాను అంటోంది. అతను అందరి ఇష్టాలు, కంఫర్ట్ టైమ్ కనుక్కొని పనులు ఒకదానితో ఒకటి కలవకుండా ఉండేలా ఒక షెడ్యూల్‌ను తయారుచేస్తాడంటోంది.ఆమె తన బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎలా కలుస్తుంది?అంతేకాదు తన 32 మంది బాయ్‌ఫ్రెండ్స్ కోసం ఆమె సమయాన్ని ఎలా కేటాయిస్తుందో కూడా తార వివరించింది. ప్రతి బాయ్‌ఫ్రెండ్‌ను వారానికి రెండుసార్లు కలవడానికి ఆమె ఒక నిర్దిష్టమైన షెడ్యూల్‌ను పాటిస్తుంది. కొందరితో కేవలం రాత్రి భోజనానికి వెళ్తే, మరికొందరితో సాధారణ విహారయాత్రలకు వెళ్తుంది. అలాగే ఇంకొందరితో ఏకాంతంగా గడపడానికి సమయాన్ని ముందుగానే నిర్ణయించుకుంటుంది. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా ఉండేలా తన మేనేజర్ అందరికీ వేర్వేరు సమయాలను (స్లాట్‌లను) కేటాయిస్తారని ఆమె బహిరంగంగానే చెప్పింది. తార ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో దీనికి భారీగా వ్యూస్ వచ్చాయి. అయితే కొందరు నెటిజన్లు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధాలను అపహాస్యం చేస్తోందని తారపై మండిపడ్డారు.తార ఎవరు?తార 26 ఏళ్ల యువతి ఆమె స్వస్థలం ముంబై. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. మొదట్లో ఆమెకు కేవలం నలుగురు లేదా ఐదుగురు స్నేహితులు మాత్రమే ఉండేవారు. కానీ క్రమంగా ఆమె స్నేహితుల వలయం విస్తరించింది. అయితే తార తన గురించి ఏ విషయాన్నీ ఎవరి నుంచీ దాచలేదు. ఆమె తన ప్రతి ప్రియుడితోనూ ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ, అన్ని వివరాలను పంచుకుంటుంది. తమకు సరిపోతుందని భావించేవారు కొనసాగుతారని, అలా అనిపించనివారు వేరే దారి చూసుకుంటారని తారా స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఆమె మేనేజర్ రోహన్ అనే 29 ఏళ్ల యువకుడు. గతంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసిన రోహన్, ప్రస్తుతం తారా వద్ద ఆమె పూర్తి షెడ్యూల్‌ను పర్యవేక్షిస్తూ మంచి వేతనం లభించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు.అంతేకాదు ఎక్కడ కలుసుకోవాలి (హోటల్ లేదా పార్క్) ఏ బాయ్‌ఫ్రెండ్‌ను కలవాలి అనేది కూడా రోహనే నిర్ణయించుకుంటాడు.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 25, 2026 11:24 AM ISTమరింత చదవండి

Source link