Last Updated:
Health Tips: ప్రతిరోజూ ఉదయాన్నే పరిగడుపున 3 ఆకులు నమలడం వల్ల ఇన్సులిన్ పెరిగి బ్లడ్ షుగర్ ఎలా అదుపులోకి వస్తుందో తెలుసా? ఇన్ఫెక్షన్లను తరిమికొట్టే ఆయుర్వేద ఆకు సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకోండి…
Health Tips: మన దేశంలో దాదాపు ప్రతి ఇంటి ముంగిట తులసి మొక్క కనిపిస్తుంది. తులసిని కేవలం ఒక పవిత్రమైన మొక్కగానే కాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా పెద్దలు భావిస్తారు. తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు మూడు తులసి ఆకులను నమలడం వల్ల శరీరానికి కలిగే ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
1. బ్లడ్ షుగర్ నియంత్రణ…
మధుమేహం (డయాబెటిస్) సమస్యతో బాధపడేవారికి తులసి ఆకులు ఒక మంచి సహజ సిద్ధమైన మందులా పనిచేస్తాయి. తులసి ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక రసాయన సమ్మేళనాలు ప్యాంక్రియాస్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధీకరించబడుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పకుండా పర్ఫెక్ట్ గా నియంత్రణలో ఉంటాయి.
2. ఇన్ఫెక్షన్లపై పోరాటం…
వాతావరణ మార్పుల వల్ల వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లను తులసి సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతాయి. నిత్యం ఉదయాన్నే తులసి ఆకులు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందుల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
3. జీర్ణక్రియ మెరుగుపడుతుంది…
పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా తులసి ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల శరీరంలో జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మెటబాలిజం వేగవంతం కావడానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
4. మానసిక ఒత్తిడి దూరం…
తులసిని ఒక అద్భుతమైన ‘అడాప్టోజెన్’గా ఆయుర్వేదంలో అభివర్ణిస్తారు. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. నిత్యం ఉదయాన్నే తులసి ఆకులు తీసుకోవడం వల్ల నరాల వ్యవస్థ ప్రశాంతంగా మారి మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు క్రమంగా దూరం అవుతాయి.
Hyderabad,Hyderabad,Telangana

