తెలుగు సినీ పరిశ్రమకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. యువత, గ్రామీణ జీవనం, స్నేహం, కుటుంబ బంధాలు, సామాజిక విలువలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది.

