త్రిప్తీ దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ విలన్గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల కానుండటం విశేషం.

