Last Updated:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ ఇటీవలే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ఉద్యోగులకు బంగారు కానుకలు ఇచ్చింది కావ్య.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె కావ్యా మారన్ ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన పెళ్లి సందర్భంగా కావ్యా మారన్ సన్ గ్రూప్ ఉద్యోగులకు ఊహించని రీతిలో ఖరీదైన బహుమతులు అందించి సర్ప్రైజ్ చేసింది కావ్య. ఉద్యోగులందరికీ బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలలో సన్ గ్రూప్ ఉద్యోగులు ఎంతో ఆనందంగా ప్రత్యేక గిఫ్ట్ బాక్సులను అన్బాక్స్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందంగా ప్యాక్ చేసిన ఆ బాక్సులలో కావ్యా మారన్, అనిరుధ్ల వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికతో పాటు ఖరీదైన చాక్లెట్లు, ఒక బంగారు ఉంగరం ఉన్నాయి. ఈ సందర్భంగా ఓ ఉద్యోగి తన సంతోషాన్ని పంచుకుంటూ.. “యాజమాన్యం నుంచి మాకు బంగారు నాణేలు ఇస్తారని అనుకున్నాం. కానీ ఇలా ఏకంగా బంగారు ఉంగరాలు ఇవ్వడంతో ఆశ్చర్యపోయాం” అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కావ్యా మారన్ ఉదారతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
SRH Owner Kavya Maran presents Gold Ring to all the Sun Group Employees.
Reception on November 25. https://t.co/eA6I4R2U1V— SportsGully Cricket 🏏 (@sportsgullycric) November 20, 2026
అయితే, సన్ గ్రూప్‌లో మొత్తం ఎంతమంది ఉద్యోగులకు ఈ బంగారు ఉంగరాలను పంపిణీ చేశారు? ఒక్కో ఉంగరం బరువు, విలువ ఎంత? అనే వివరాలపై సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ఈ గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న కార్డులో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. వివాహ వేడుకను పురస్కరించుకుని నవంబర్ 25న సన్ గ్రూప్ ఉద్యోగులందరి కోసం ప్రత్యేక విందు (లంచ్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
కాగా, నవంబర్ 21న చెన్నైలో కావ్యా మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ గ్రాండ్ వేడుకకు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర తారలు, క్రికెట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు.

