Last Updated:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ తినాలా? పరాఠా తీసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
మధుమేహం, బరువు నియంత్రణ, రోజువారీ జీవనశైలిని బట్టి ఏ అల్పాహారం ఎంచుకోవాలో డైటీషియన్ సూచనలు తెలుసుకోండి.
ఉదయం అల్పాహారంలో ఏం తినాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇడ్లీ, దోశ తినాలా? లేక పరాఠా తీసుకోవాలా? అనే ప్రశ్న తరచూ ఎదురవుతుంది. ఈ మూడు ఆహార పదార్థాలు రుచికరమైనవే అయినప్పటికీ, వాటి ద్వారా శరీరానికి అందే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై డైటీషియన్ అస్మీ భట్ పలు సూచనలు చేశారు.
ఉదయం పరాఠా తింటే మంచిదా?
డైటీషియన్ అస్మీ భట్ అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన వారు, రోజంతా ఉద్యోగం లేదా ఇతర పనుల కోసం ప్రయాణాలు చేసేవారు ఉదయం అల్పాహారంలో పోషకాలు కలిగిన పరాఠాను ఎంచుకోవచ్చు. అయితే బంగాళాదుంప పరాఠాకు బదులుగా పనీర్ పరాఠా, కూరగాయల పరాఠా లేదా మొలకలతో తయారు చేసిన పరాఠా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
వీటితో పాటు పెరుగు, చట్నీ తీసుకుంటే మంచి ఆహార కలయిక అవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం సమయానికి చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది. అయితే పరాఠా తయారీలో నూనె, నెయ్యి, వెన్న పరిమాణాన్ని పరిమితంగా ఉంచాలి.
ఇడ్లీ, దోశ తినేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి: ఇడ్లీ, దోశలు మంచి అల్పాహార ఎంపికలే. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని తినేటప్పుడు ఆహార పరిమాణం, వాటితో తీసుకునే ఇతర పదార్థాలపై దృష్టి పెట్టాలి. ఇడ్లీ, దోశల్లో కార్బోహైడ్రేట్లు ఉండటంతో కొందరిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది.
అందుకే ఇడ్లీ లేదా దోశ తినేటప్పుడు సాంబార్, కూరగాయలతో కూడిన చట్నీకి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో ప్రోటీన్, ఫైబర్ అందేలా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను బట్టి ఆహార పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
పోహా, ఉప్మా, పరాఠా.. ఈ మూడూ అల్పాహారానికి మంచి ఎంపికలుగా నిలుస్తాయి. అయితే ఏది తినాలనేది మన రోజువారీ జీవనశైలి, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అల్పాహారంలో కూరగాయలు, ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఏ ఆహారం తీసుకున్నా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై దాని ప్రభావాన్ని గమనించాలి. సరైన ఆహార కలయిక, తగిన పరిమాణం, సరైన సమయానికి భోజనం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు. ఏ ఒక్క ఆహార పదార్థమూ అందరికీ ఒకే విధంగా మంచిదని చెప్పలేమని నిపుణులు సూ

