ఈ మార్పులపై చర్చించేందుకు న్యూస్18 ఆధ్వర్యంలో రైజింగ్ భారత్ సమ్మిట్ – నార్త్ ఎడిషన్ నిర్వహించనున్నారు. 2026 నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ, వ్యాపార, సాంకేతిక, వినోద, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. ఉత్తర భారత అవకాశాలు, లక్ష్యాలు, భవిష్యత్తు మార్పులపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా (నంది) హాజరుకానున్నారు. అమృత్ అభిజాత్, అలోక్ కుమార్, కె. విజయేంద్ర పాండియన్, అవనీష్ అవస్థి పరిపాలన, సంస్థాగత అంశాలపై మాట్లాడనున్నారు. మౌలిక సదుపాయాలు, పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడుల విస్తరణకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు.
మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, ఎండీ రాజేష్ అగర్వాల్, వన్‌ప్లస్, ఒప్పో ఇండియా పరిశోధన విభాగం ఎండీ తస్లీమ్ ఆరిఫ్, మారుతీ సుజుకీకి చెందిన పార్థో బెనర్జీ, అనంత్ సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమియా పాఠక్ పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, వాహన రంగంలో కొత్త ఆవిష్కరణలు, రవాణా, సాంకేతిక అభివృద్ధిపై చర్చిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన రవి సంతానం వినియోగదారుల అభిరుచులు, ఆర్థిక మార్పులపై తన అభిప్రాయాలు వెల్లడిస్తారు.
సెమీకండక్టర్లు, రక్షణ, ఆధునిక ఇంజినీరింగ్ రంగాలపై కూడా చర్చలు జరగనున్నాయి. సంపిగే సెమీకండక్టర్స్‌కు చెందిన పరాగ్ నాయక్, ఐజీ డిఫెన్స్‌కు చెందిన బోధిసత్వ సంఘప్రియ, ఎల్‌అండ్‌టీకి చెందిన సతీష్ భరతన్, ఓమ్నిప్రెజెంట్ రోబోట్ టెక్నాలజీస్‌కు చెందిన జ్యోతి వశిష్ఠ సిన్హా పాల్గొంటారు.
దేశీయ బ్రాండ్ల అభివృద్ధిపై ఆర్చియన్ ఫుడ్స్ (లాహోరీ జీరా)కు చెందిన సౌరభ్ ముంజాల్, ది హేజల్‌నట్ ఫ్యాక్టరీకి చెందిన అంకిత్ సాహ్ని మాట్లాడనున్నారు. సినీ రంగం నుంచి పంకజ్ త్రిపాఠి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నిర్మాత బోనీ కపూర్, జానపద గాయని మాలిని అవస్థి పాల్గొంటారు.
క్రీడా రంగం నుంచి భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, క్రికెటర్ సురేశ్ రైనా, అథ్లెట్ పారుల్ చౌధరి హాజరవుతారు. విధాన నిర్ణయాల నుంచి పరిశ్రమలు, సాంకేతికత, వ్యాపారం, సంస్కృతి, క్రీడల వరకు విభిన్న రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ఈ సదస్సు.. ఉత్తర భారత సామర్థ్యాలు దేశ ప్రగతికి ఎలా తోడ్పడతాయనే అంశంపై చర్చించనుంది.
