డెలివరీ ప్యాకేజీపై ఉండే షిప్పింగ్ స్టిక్కర్లో సాధారణంగా కస్టమర్ పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, ఈమెయిల్ ఐడీ, కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసిన వస్తువు వివరాలు కూడా ఉంటాయి. ఈ సమాచారం తప్పు వ్యక్తుల చేతికి వెళ్తే, దాన్ని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. చివరికి అది ఆర్థిక మోసంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మోసం మీరు పారేసిన పార్సిల్ బాక్స్‌తోనే మొదలవుతుంది. మోసగాళ్లు చెత్త బుట్టలు లేదా చెత్త సేకరించే ప్రాంతాల నుంచి వాడేసిన డెలివరీ బాక్స్‌లను తీసుకుని, వాటిపై ఉన్న షిప్పింగ్ స్టిక్కర్‌లోని సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ఆ వివరాలతో వారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా డెలివరీ పార్ట్నర్ ప్రతినిధులమని చెప్పి బాధితులకు ఫోన్ చేస్తారు. మీ వ్యక్తిగత వివరాలు, మీరు ఇటీవల కొనుగోలు చేసిన వస్తువు గురించి వారికి ఇప్పటికే తెలిసి ఉండటంతో, వారి మాటలు నిజమైనవే అనిపిస్తాయి. దీంతో వారి మీద నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది. (image: AI Generated)

