Last Updated:
‘ఫౌజీ’ సినిమా పోస్ట్ పోన్ అవడంతో అదే డేట్‌పై చాలా సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. అందులో అలియాస్ రుక్మిణి ఒకటి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ విపరీతమైన పాజిటీవ్ హైప్ తీసుకొచ్చాయి.
‘ఫౌజీ’ సినిమా పోస్ట్ పోన్ అవడంతో అదే డేట్‌పై చాలా సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. అందులో అలియాస్ రుక్మిణి ఒకటి. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ విపరీతమైన పాజిటీవ్ హైప్ తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చూడబోతున్నాం అనే క్లారిటీ వచ్చేసింది. దండోరా మూవీ డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతుంది.
తాజాగా ఈ సినిమా యూనిట్ ఓ స్పెషల్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో నితిన్ కృష్ణ రోల్లో కనిపించాడు. ముఖ్యంగా నితిన్ అన్న లుక్ మాత్రం విపరీతమైన ఆసక్తి క్రియేట్ చేసింది. రుక్మిణీ తన లైఫ్‌లోకి రాకముందు కృష్ణ ఎలా ఉండేవాడు? టీనేజ్‌లో కృష్ణ చేసే అల్లరి, ఆయన అమాయకత్వం ఎలా ఉండేవి అనే విషయాలను ఈ వీడియోలో పంచుకున్నారు.
Before Rukmini became his world, there was younger Krishna, a dreamer ✨️
Reintroducing Krishna from #AliasRukmini with a whole new side of @actor_nithiin ❤️In cinemas worldwide December 4th.
Natural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚
Written & Directed by @Afilmby_Murali
#AliasRukminiOnDec4th
#AafiyaSayed @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth— Unanimous Productions (@UnanimousProds) November 7, 2026
రుక్మిణి రోల్లో నటిస్తున్న ఆఫియా సయ్యద్‌తో యంగ్ కృష్ణ గురించి మాట్లాడుతున్నట్లు వీడియోలో చూపించారు. ఇందులో నితిన్ దాదాపు పదేళ్లు చిన్నవాడిగా కనిపించున్నాడు. అసలు టీనేజ్ లుక్‌లో నితిన్ చాలా కొత్తగా అనిపించాడు. అప్పుడప్పుడే మొలిచిన మీసాలు, మంచి క్రాఫ్‌తో ఉన్న జుట్టు, రంగు రంగుల టీ షార్ట్‌తో చాలా కొత్త లుక్‌లో కనిపించాడు.
డెస్క్ దగ్గర పెన్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తున్న కుర్రాడిగా నితిన్ కనిపించిన తీరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆయన కొత్త లుక్‌ను చూసి ఆఫియా సయ్యద్ సైతం ఆశ్చర్యపోయినట్లు వీడియోలో చూపించారు. కృష్ణ పాత్రలో నితిన్ చూపించిన అమాయకత్వం, కుర్రతనం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో చూసిన నితిన్‌కు భిన్నంగా ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ‘రుకు రుకు రుక్మిణి’ సాంగ్ మార్మోగిపోతుంది. అసలు ఏ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లో చూసిన ఈ సాంగే ట్రెండింగ్. జనాలు రిపీటెడ్‌గా లూప్‌లో వింటున్నారు. విజయ్ బుల్గానిన్ టెర్రిఫిక్ ట్యూన్‌కు అనురాగ్ కులకర్ణం వోకల్స్ నెక్స్ట్ లెవల్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో సాంగ్‌ను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ కాబోతుంది.

