ప్రభన్యూస్

Rajinikanth: మెట్ల మీద నుంచి పడిపోయిన రజనీకాంత్ సోదరుడు.. అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో బెంగళూరు వెళ్లారు.

News18
News18

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో బెంగళూరు వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడు సత్యనారాయణ రావ్ గైక్వాడ్‌ను పరామర్శించారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లిన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావ్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్లపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. తల భాగానికి దెబ్బ తగలడంతో భారీగా రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించారు. తలకు తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్లు తెరవలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆయన గురువారం బెంగళూరు వెళ్లారు. రాజరాజేశ్వరినగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని సత్యనారాయణ రావ్‌ను పరామర్శించారు.

ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి సోదరుడి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదరుడి పరిస్థితిపై వైద్యుల నుంచి సమాచారం తీసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి బయలుదేరారు.

రజనీకాంత్ తన సోదరుడిని పరామర్శించేందుకు బెంగళూరు రావడం కుటుంబ సభ్యులపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోంది. సినిమా షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

సోదరుడిని ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం రజనీకాంత్ కనకపుర రోడ్డులోని రవిశంకర్ గురు ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపినట్లు సమాచారం. కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత ఆశ్రమానికి వెళ్లడం కూడా ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావ్ ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ‘జైలర్ 2’ విజయంతో సంతోషంలో ఉన్న రజనీకాంత్.. కుటుంబంలో ఎదురైన ఈ పరిస్థితి కారణంగా సోదరుడిని పరామర్శించేందుకు బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 5:48 pm Digital Edition : Prabhanews
Rajinikanth: మెట్ల మీద నుంచి పడిపోయిన రజనీకాంత్ సోదరుడు.. అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 06, 2026 5:33 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో బెంగళూరు వెళ్లారు.News18సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా కుటుంబానికి సంబంధించిన ఓ విషయంలో బెంగళూరు వెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడు సత్యనారాయణ రావ్ గైక్వాడ్‌ను పరామర్శించారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ ఆస్పత్రికి వెళ్లిన విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావ్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్లపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. తల భాగానికి దెబ్బ తగలడంతో భారీగా రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు ఆయనకు అవసరమైన చికిత్స అందించారు. తలకు తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్లు తెరవలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆయన గురువారం బెంగళూరు వెళ్లారు. రాజరాజేశ్వరినగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని సత్యనారాయణ రావ్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి సోదరుడి ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోదరుడి పరిస్థితిపై వైద్యుల నుంచి సమాచారం తీసుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి బయలుదేరారు.రజనీకాంత్ తన సోదరుడిని పరామర్శించేందుకు బెంగళూరు రావడం కుటుంబ సభ్యులపై ఆయనకున్న ప్రేమను తెలియజేస్తోంది. సినిమా షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.సోదరుడిని ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం రజనీకాంత్ కనకపుర రోడ్డులోని రవిశంకర్ గురు ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపినట్లు సమాచారం. కుటుంబ సభ్యుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత ఆశ్రమానికి వెళ్లడం కూడా ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావ్ ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ‘జైలర్ 2’ విజయంతో సంతోషంలో ఉన్న రజనీకాంత్.. కుటుంబంలో ఎదురైన ఈ పరిస్థితి కారణంగా సోదరుడిని పరామర్శించేందుకు బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.మరింత చదవండి

Source link