టీసీఎల్ 75 పీ8ఎల్ మోడల్ సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్ కోసం. సినిమాలు చూడటం, క్రికెట్ మ్యాచ్‌లు ఆస్వాదించడం, గేమింగ్ ఆడటం ఇష్టపడే వారికి టీసీఎల్ పీ8ఎల్ ఉపయోగపడుతుంది. ఇందులో మినీ ఎల్ఈడీ టెక్నాలజీతో పాటు లోకల్ డిమ్మింగ్ సదుపాయం ఉంది. దీనివల్ల స్క్రీన్‌పై కాంట్రాస్ట్ మెరుగుపడుతుంది. చిత్రాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, ఫుల్ ఛానల్ హై రిఫ్రెష్ రేట్, హెచ్డీఎంఐ 2.1 కనెక్టివిటీ కూడా ఇందులో ఉన్నాయి. ఓంక్యో (ONKYO) స్పీకర్లతో మెరుగైన ఆడియో అనుభూతి లభిస్తుంది. సినిమాలు చూసే సమయంలోనే కాకుండా గేమింగ్ ఆడేటప్పుడు కూడా మంచి అనుభూతిని అందించేలా దీన్ని రూపొందించారు. (image: TCL)

