ప్రభన్యూస్

Heroine Honey Trap: వామ్మో, తెలుగు హీరోయిన్ హనీ ట్రాప్.. డాక్టర్‌ నుంచి లక్షలు దోపిడీ, అరెస్ట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కేరళలోని కొచ్చిలో వెలుగుచూసిన హీరోయిన్ హనీట్రాప్, దోపిడీ కేసు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అత్యవసర వైద్య సహాయం పేరుతో ఒక యువ డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి దోపిడీకి పాల్పడిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది.

News18
News18

కేరళలోని కొచ్చిలో వెలుగుచూసిన ఒక హనీట్రాప్, దోపిడీ కేసు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అత్యవసర వైద్య సహాయం పేరుతో ఒక యువ డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి దోపిడీకి పాల్పడిన ఘటనలో ప్రముఖ నటి, ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ ఫేమ్ అతుల్య చంద్ర, మలయాళ నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలను పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా సినీ నటీనటులే ఇలాంటి నేరానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల ఎఫ్‌ఐఆర్, స్థానిక వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని ‘ఎసెన్ స్ప్రింగ్‌డేల్’ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే రావాలని కొందరు వ్యక్తులు ఒక యువ డాక్టర్‌కు ఫోన్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని భావించిన ఆ వైద్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. అయితే, ఆయన లోపలికి అడుగుపెట్టగానే ఫ్లాట్‌లో ఉన్న సుమారు 12 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. ఆ తర్వాత డాక్టర్‌పై తమ బంధువుపై అత్యాచారం చేశాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, పరువు తీస్తామని బెదిరింపులకు దిగారు.

ఈ క్రమంలోనే నటుడు బిబిన్ పెరుంబిల్లి నేతృత్వంలోని ముఠా ఆ డాక్టర్‌ను బలవంతంగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేశారు. చెంపలపై, పక్కటెముకలపై తీవ్రంగా కొట్టారు. ఇదే సమయంలో నటి అతుల్య చంద్ర రంగంలోకి దిగి, డాక్టర్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఖరీదైన స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ (మొత్తం విలువ సుమారు రూ.3.5 లక్షలు) బలవంతంగా లాక్కున్నారు. “నువ్వొక దొంగవి, నిన్ను ప్రాణాలతో వదలం” అంటూ ఆమె అత్యంత అసభ్య పదజాలంతో దూషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఆ వైద్యుడిని ఒక చీకటి గదిలో బంధించి దారుణంగా హింసించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ డాక్టర్ అత్యంత సాహసోపేతంగా అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా కడవంత పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతుల్య చంద్ర, బిబిన్ పెరుంబిల్లిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న మిగిలిన 10 మంది కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం దోపిడీ కోసమే పక్కా స్కెచ్ వేసి ఈ నాటకం ఆడారా? లేక దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత హనీట్రాప్ (Honey-trap) ముఠా హస్తం ఉందా? గతంలో కూడా ఇలాగే ఎవరినైనా ప్రముఖులను బురిడీ కొట్టించారా? అనే కోణంలో కడవంత పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 3:20 pm Digital Edition : Prabhanews
Heroine Honey Trap: వామ్మో, తెలుగు హీరోయిన్ హనీ ట్రాప్.. డాక్టర్‌ నుంచి లక్షలు దోపిడీ, అరెస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 06, 2026 3:19 PM ISTకేరళలోని కొచ్చిలో వెలుగుచూసిన హీరోయిన్ హనీట్రాప్, దోపిడీ కేసు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అత్యవసర వైద్య సహాయం పేరుతో ఒక యువ డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి దోపిడీకి పాల్పడిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. News18కేరళలోని కొచ్చిలో వెలుగుచూసిన ఒక హనీట్రాప్, దోపిడీ కేసు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అత్యవసర వైద్య సహాయం పేరుతో ఒక యువ డాక్టర్‌ను ఫ్లాట్‌కు రప్పించి, కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి దోపిడీకి పాల్పడిన ఘటనలో ప్రముఖ నటి, ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ ఫేమ్ అతుల్య చంద్ర, మలయాళ నటుడు, నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలను పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని, ఏకంగా సినీ నటీనటులే ఇలాంటి నేరానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసుల ఎఫ్‌ఐఆర్, స్థానిక వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని ‘ఎసెన్ స్ప్రింగ్‌డేల్’ అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే రావాలని కొందరు వ్యక్తులు ఒక యువ డాక్టర్‌కు ఫోన్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని భావించిన ఆ వైద్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. అయితే, ఆయన లోపలికి అడుగుపెట్టగానే ఫ్లాట్‌లో ఉన్న సుమారు 12 మంది వ్యక్తులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టారు. ఆ తర్వాత డాక్టర్‌పై తమ బంధువుపై అత్యాచారం చేశాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, పరువు తీస్తామని బెదిరింపులకు దిగారు.ఈ క్రమంలోనే నటుడు బిబిన్ పెరుంబిల్లి నేతృత్వంలోని ముఠా ఆ డాక్టర్‌ను బలవంతంగా ఒక కుర్చీలో కూర్చోబెట్టి విచక్షణారహితంగా దాడి చేశారు. చెంపలపై, పక్కటెముకలపై తీవ్రంగా కొట్టారు. ఇదే సమయంలో నటి అతుల్య చంద్ర రంగంలోకి దిగి, డాక్టర్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఖరీదైన స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ (మొత్తం విలువ సుమారు రూ.3.5 లక్షలు) బలవంతంగా లాక్కున్నారు. "నువ్వొక దొంగవి, నిన్ను ప్రాణాలతో వదలం" అంటూ ఆమె అత్యంత అసభ్య పదజాలంతో దూషించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఆ వైద్యుడిని ఒక చీకటి గదిలో బంధించి దారుణంగా హింసించారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ డాక్టర్ అత్యంత సాహసోపేతంగా అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా కడవంత పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతుల్య చంద్ర, బిబిన్ పెరుంబిల్లిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. పరారీలో ఉన్న మిగిలిన 10 మంది కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేవలం దోపిడీ కోసమే పక్కా స్కెచ్ వేసి ఈ నాటకం ఆడారా? లేక దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత హనీట్రాప్ (Honey-trap) ముఠా హస్తం ఉందా? గతంలో కూడా ఇలాగే ఎవరినైనా ప్రముఖులను బురిడీ కొట్టించారా? అనే కోణంలో కడవంత పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.మరింత చదవండి

Source link