ప్రభన్యూస్

Ramayana Mahesh Babu: రామాయణంపై మహేష్ బాబు ఒపీనియన్.. సినిమా చూడగానే ఏమన్నారంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ (పార్ట్-1) థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన మహేష్ బాబు, తన ఒపీనియన్ చెప్పారు.

News18
News18

నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణం’ (పార్ట్-1) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ పై ఇప్పటికే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. సినిమా చూసిన అనంతరం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అద్భుతమైన రివ్యూను పంచుకున్నారు.

“మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఇతిహాస కథలు, వెండితెరపై ఇంత అద్భుతంగా, సజీవంగా ప్రాణం పోసుకోవడం చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్, సీతగా సాయి పల్లవిల అభినయం నిజంగా మ్యాజికల్. వారి నటన అద్భుతం. ఈ చిత్రాన్ని ఇంత భారీ స్కేల్ లో, విజువల్ గ్రాండియర్ గా రూపొందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు నా హ్యాట్సాఫ్. మీ అంకితభావం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. ‘రామాయణ’ చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు” అని మహేష్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

మహేష్ బాబు ‘రామాయణం’ సినిమాపై చేసిన ఈ ప్రశంసలు, ఇప్పుడు ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) పై అంచనాలను అమాంతం పెంచేశాయి. గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’, సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్, మైథాలజీ అంశాల కలయికతో రూపొందుతోంది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో సుమారు 20 నిమిషాల పాటు సాగే ఒక రామాయణ ఎపిసోడ్ కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ భారీ యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు తొలిసారిగా శ్రీరాముడి అవతారంలో కనిపించనున్నారు.

ఇండియన్ స్క్రీన్ పై మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా, హాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని ఫిజిక్ తో మెప్పించే మహేష్ బాబు, శ్రీరాముడిగా కనిపిస్తే ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్ రాముడిగా అదరగొట్టగా, ఇప్పుడు ఐకానిక్ శ్రీరాముడి పాత్రలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్వయంగా రాజమౌళి సైతం లుక్ టెస్ట్ సమయంలో రాముడి గెటప్‌లో మహేష్ ను చూసి ఆశ్చర్యపోయి, మంత్రముగ్ధులయ్యారని ఇన్‌సైడ్ టాక్. దీన్ని బట్టి చూస్తే ‘వారణాసి’లో మహేష్ బాబు రాముడి అవతారం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 November 2026, 2:58 pm Digital Edition : Prabhanews
Ramayana Mahesh Babu: రామాయణంపై మహేష్ బాబు ఒపీనియన్.. సినిమా చూడగానే ఏమన్నారంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 06, 2026 2:25 PM ISTనితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (పార్ట్-1) థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన మహేష్ బాబు, తన ఒపీనియన్ చెప్పారు. News18నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' (పార్ట్-1) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించిన ఈ విజువల్ వండర్ పై ఇప్పటికే దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. సినిమా చూసిన అనంతరం ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అద్భుతమైన రివ్యూను పంచుకున్నారు."మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఇతిహాస కథలు, వెండితెరపై ఇంత అద్భుతంగా, సజీవంగా ప్రాణం పోసుకోవడం చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్, సీతగా సాయి పల్లవిల అభినయం నిజంగా మ్యాజికల్. వారి నటన అద్భుతం. ఈ చిత్రాన్ని ఇంత భారీ స్కేల్ లో, విజువల్ గ్రాండియర్ గా రూపొందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారీలకు నా హ్యాట్సాఫ్. మీ అంకితభావం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. 'రామాయణ' చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అని మహేష్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.మహేష్ బాబు 'రామాయణం' సినిమాపై చేసిన ఈ ప్రశంసలు, ఇప్పుడు ఆయన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' (SSMB29) పై అంచనాలను అమాంతం పెంచేశాయి. గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి', సోషియో ఫాంటసీ, టైమ్ ట్రావెల్, మైథాలజీ అంశాల కలయికతో రూపొందుతోంది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో సుమారు 20 నిమిషాల పాటు సాగే ఒక రామాయణ ఎపిసోడ్ కీలకంగా ఉండబోతోందని సమాచారం. ఈ భారీ యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు తొలిసారిగా శ్రీరాముడి అవతారంలో కనిపించనున్నారు.ఇండియన్ స్క్రీన్ పై మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా, హాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని ఫిజిక్ తో మెప్పించే మహేష్ బాబు, శ్రీరాముడిగా కనిపిస్తే ఆ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్ రాముడిగా అదరగొట్టగా, ఇప్పుడు ఐకానిక్ శ్రీరాముడి పాత్రలో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్వయంగా రాజమౌళి సైతం లుక్ టెస్ట్ సమయంలో రాముడి గెటప్‌లో మహేష్ ను చూసి ఆశ్చర్యపోయి, మంత్రముగ్ధులయ్యారని ఇన్‌సైడ్ టాక్. దీన్ని బట్టి చూస్తే 'వారణాసి'లో మహేష్ బాబు రాముడి అవతారం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.మరింత చదవండి

Source link