Piles Care: ఆధునిక ఉరుకుల పరుగుల జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల తీవ్రంగా వేధించే జీర్ణకోశ సమస్యల్లో మొలలు లేదా పైల్స్ ఒకటని 16 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ కొలొరెక్టల్ సర్జన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు వివరిస్తున్నారు. మలద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి వాపు రావడం, విపరీతమైన నొప్పి, మంట, మలవిసర్జన సమయంలో రక్తస్రావం కావడం వంటివి బాధితులను నరకం చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. పైల్స్ సమస్య తీవ్రం కావడానికి ప్రధాన మూలకారణం దీర్ఘకాలిక మలబద్ధకం అని తెలుపుతున్నారు. మలం గట్టిపడినప్పుడు దానిని బయటకు నెట్టేందుకు విపరీతంగా ముక్కడం వల్ల అక్కడి సున్నితమైన రక్తనాళాలు చిట్లిపోతాయని పేర్కొంటున్నారు. మనం రోజూ తీసుకునే ఆహారమే పైల్స్‌ను తగ్గించగలదు లేదా పరిస్థితిని మరింత విషమించేలా చేయగలదని హెచ్చరిస్తున్నారు. మొలల సమస్యతో బాధపడేవారు పొరపాటున కూడా తినకూడని ఆ 5 ప్రధాన ఆహారాల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

