ఈ సినిమా నవంబర్ 12న చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలో విడుదల కానుంది. చిన్నారులకు ఆలోచింపజేసే, మంచి సందేశాన్ని అందించేలా రూపొందిన ఈ చిత్రం పిల్లలకు తల్లిదండ్రులకు, టీచర్స్‌కి ఒక మంచి సినీ అనుభూతిని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ చిత్రాన్ని చూడాలని చిత్ర బృందం కోరుతోంది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలతో కలిసి ఆనందించదగిన చిత్రంగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్‌ను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలాబాగుంది. దివ్యప్రవీణ్ గారు నాకు ఈ సినిమా గురించి ముందే చెప్పారు. నేను కూడా ఓ టీచర్‌గా పని చేశాను. ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రం హిందీలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో.. తెలుగులో ఈ చిత్రం అంతటి పెద్ద విజయాన్ని అందుకుంటుంది ఈ సినిమాని పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ తప్పకచూడాల్సిన సినిమా’ నేను మొదటి రోజే ఒక హాల్ మొత్తం బుక్ చేసుకొని నేను మా టీచర్లు మా స్టూడెంట్స్ అందరం కలిసి మొదటి షో చూస్తాము” అని అన్నారు.
ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘నవీన్‌కి జాతీయ అవార్డులు వచ్చాయి. బయటి భాషల్లో సినిమాలు చేసి అవార్డులు సాధించారు. ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు. అమ్మా, నాన్న, గురువు గొప్పదనం చాటి చెప్పేలా ఈ చిత్రం ఉంటుంది. మా అబ్బాయి జయంత్ చక్కగా నటించాడు. ఈ సినిమాకి పాటలు, మాటలు, ట్యూన్స్ అన్నీ నేను ఇచ్చాను. విద్యా వ్యవస్థపై ఎక్కుపెట్టే సినిమా ఇది. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. ప్రతీ స్టూడెంట్, ప్రతీ పేరెంట్, ప్రతి టీచర్ చూడాల్సిన సినిమా ఇది’ అని అన్నారు.
దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘ప్రతీ ఒక్క స్టూడెంట్ మనసుని టీచర్ అర్థం చేసుకోవాలి. వారు సాధించే మార్కుల కంటే వారి మనసుల్ని చూడాలని, అర్థం చేసుకోవాలని ఈ మూవీని తీశాం. మా అబ్బాయి జయంత్, ఇతర ఆర్టిస్టులంతా కూడా ఎంతో సహకరించారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. ప్రేమతో ఈ సినిమాని తీశాం.
నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కళాత్మక సినిమాల్ని ప్రజలు ఆదరించాలి. సినిమా అనేది ప్రభావితం చేసే మాధ్యమం. ఇలాంటి చిత్రాల్ని చూసినప్పుడు ఎంతో మంచిని గ్రహించొచ్చు. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ కలిసి ఈ మూవీని చూడాలి’ అని అన్నారు. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తారే జమీన్ పర్’ సినిమాని గతంలో చూశాను. ఇప్పుడు దాని కంటే గొప్పగా ఉండే ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాని పిల్లలు, పేరెంట్స్ టీచర్స్ అందరూ చూడాలి’ అని అన్నారు.
సహ నిర్మాత షఫీ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఎంతో ఎమోషనల్‌గా, స్పూర్తినింపేలా ఉంటుంది. ఈ స్కూల్ నుంచే జయంత్ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో మంచి సందేశం ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చూడాల్సిన చిత్రిమిది’ ని అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో జయంత్ అద్భుతంగా నటించాడు. ఎంతో నేచురల్‌గా యాక్ట్ చేశాడు. ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ అందరూ చూడాల్సిన సినిమా’ అని అన్నారు.
బేబీ ఊహా రెడ్డి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని మేమంతా ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం. ఇది చాలా మంచి చిత్రం. ఈ మూవీని పేరెంట్స్‌తో టీచర్స్ తో కలిసి అందరూ చూడండి’ అని అన్నారు. మాస్టర్ జయంత్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తల్లిదండ్రులకు థాంక్స్. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. యాక్టింగ్‌లో మెళుకువలు నేర్పిన సత్యం రాజేష్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ అందరికీ థాంక్స్. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అందరూ తప్పకుండా చూడండి పిల్లలు రెగ్యులర్‌గా ఎదుర్కొనే సమస్యలు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రిలేషన్ మరియు తల్లిదండ్రులు తాత ఎమోషన్స్ పై అద్భుతంగా ఉంటుంది’ అని అన్నారు.
ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా,
మోహిత్ కులకర్ణి సంగీతం అందిస్తున్నారు.
