ప్రభన్యూస్

Samantha Ruth Prabhu: తొమ్మిదో నెలలోనూ తగ్గేదే లే.. సమంత జిమ్ వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

News18
News18

తన అద్భుతమైన నటనతో, క్యూట్ స్మైల్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఫిట్‌నెస్ కాపాడుకునే విషయంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం సమంత తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వనుంది సమంత. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలోనూ ఆమె ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడుతుందో తాజా వీడియో స్పష్టం చేస్తోంది.

తన ప్రెగ్నెన్సీ జర్నీలో మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తన శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆమె ఎలాంటి వ్యాయామాలు చేశారో ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. ఒక్కో నెల గడుస్తున్న కొద్దీ ఆమె ఫిట్‌నెస్ ప్రయాణం ఎలా సాగిందో తెలిసేలా ఈ వీడియోను రూపొందించారు. ముఖ్యంగా సమంత తన ఛాతీ దగ్గర ఒక డంబెల్ పట్టుకుని, బరువుతో కూడిన స్క్వాట్స్ (Weighted Squats) చేస్తున్నట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిండు గర్భిణీగా ఉండి, అది కూడా తొమ్మిదో నెలలో ఇంత కఠినమైన వ్యాయామాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ వీడియోకి “9వ నెల.. ఫైనల్ ల్యాప్” (9th month.. final lap) అంటూ ఒక క్యాప్షన్ కూడా జతచేసి ఉండటంతో, ఆమె ప్రసవ సమయం చాలా దగ్గర పడిందనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ కావడం సాధారణమే. అయితే సమంత ఎప్పుడూ తన ఆరోగ్యానికి, వర్కౌట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జిమ్ చేయడం మానదు. గర్భధారణ సమయంలో కూడా ఆమె ఫిట్‌నెస్‌కు ఇంతలా ప్రాధాన్యత ఇస్తుండటం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గర్భిణీగా ఉన్న ఆ కఠినమైన వర్కౌట్స్ వీడియో మాత్రం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

సమంత సినిమాల విషయానికొస్తే.. చివరగా మా ఇంటి బంగారం సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ, ప్రెగెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రెస్ట్ తీసుకుంటూ తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఇది కొంతకాలం విరామం మాత్రమే అంటోంది సమంత. అంటే బిడ్డకు తల్లయ్యాక కూడా తన కెరీర్ కంటిన్యూ చేస్తానని హింట్ ఇస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 1:05 pm Digital Edition : Prabhanews
Samantha Ruth Prabhu: తొమ్మిదో నెలలోనూ తగ్గేదే లే.. సమంత జిమ్ వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 31, 2026 12:45 PM ISTప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
News18తన అద్భుతమైన నటనతో, క్యూట్ స్మైల్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఫిట్‌నెస్ కాపాడుకునే విషయంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం సమంత తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వనుంది సమంత. ఈ నేపథ్యంలో గర్భధారణ సమయంలోనూ ఆమె ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడుతుందో తాజా వీడియో స్పష్టం చేస్తోంది.తన ప్రెగ్నెన్సీ జర్నీలో మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తన శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆమె ఎలాంటి వ్యాయామాలు చేశారో ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. ఒక్కో నెల గడుస్తున్న కొద్దీ ఆమె ఫిట్‌నెస్ ప్రయాణం ఎలా సాగిందో తెలిసేలా ఈ వీడియోను రూపొందించారు. ముఖ్యంగా సమంత తన ఛాతీ దగ్గర ఒక డంబెల్ పట్టుకుని, బరువుతో కూడిన స్క్వాట్స్ (Weighted Squats) చేస్తున్నట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిండు గర్భిణీగా ఉండి, అది కూడా తొమ్మిదో నెలలో ఇంత కఠినమైన వ్యాయామాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వీడియోకి "9వ నెల.. ఫైనల్ ల్యాప్" (9th month.. final lap) అంటూ ఒక క్యాప్షన్ కూడా జతచేసి ఉండటంతో, ఆమె ప్రసవ సమయం చాలా దగ్గర పడిందనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ కావడం సాధారణమే. అయితే సమంత ఎప్పుడూ తన ఆరోగ్యానికి, వర్కౌట్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జిమ్ చేయడం మానదు. గర్భధారణ సమయంలో కూడా ఆమె ఫిట్‌నెస్‌కు ఇంతలా ప్రాధాన్యత ఇస్తుండటం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గర్భిణీగా ఉన్న ఆ కఠినమైన వర్కౌట్స్ వీడియో మాత్రం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.సమంత సినిమాల విషయానికొస్తే.. చివరగా మా ఇంటి బంగారం సినిమా చేసిన ఈ ముద్దుగుమ్మ, ప్రెగెన్సీ కన్ఫర్మ్ అయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రెస్ట్ తీసుకుంటూ తన ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది. అయితే ఇది కొంతకాలం విరామం మాత్రమే అంటోంది సమంత. అంటే బిడ్డకు తల్లయ్యాక కూడా తన కెరీర్ కంటిన్యూ చేస్తానని హింట్ ఇస్తోంది.మరింత చదవండి

Source link