ప్రభన్యూస్

Sanjay Guptha: సినీ ఇంస్ట్రీలో తీవ్ర విషాదం.. వాష్‌రూమ్‌లో జారిపడి ప్రముఖ దర్శకుడు మృతి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ స్టార్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు.

News18
News18

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ స్టార్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలోని వాష్‌రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఆయన తలకు తీవ్ర గాయమైందని, ఆ కారణంగానే ఆయన మరణించారని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఆయన హఠాన్మరణం వార్త విని హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి హీరోలుగా వచ్చిన ‘ఆతిష్’ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సంజయ్ గుప్తా, తొలి సినిమాతోనే తన మార్క్ చూపించారు. అయితే 2002లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి వంటి భారీ తారాగణంతో ఆయన తెరకెక్కించిన ‘కాంటే’ (Kaante) చిత్రం బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ క్లాసిక్ ‘రెజర్వాయర్ డాగ్స్’ స్ఫూర్తితో వచ్చిన ఈ మూవీ.. మేకింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా బాలీవుడ్ కు కొత్త ఒరవడిని పరిచయం చేసింది. ఆ తర్వాత ఆయన ‘జిందా’, ‘దస్ కహానియాన్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

2017లో హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా రూపొందించిన ‘కాబిల్’ ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ ‘రయీస్’ కు పోటీగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2024లో ఓటీటీ వేదికగా విడుదలైన ‘ది మిరాండా బ్రదర్స్’ దర్శకుడిగా ఆయన చివరి చిత్రం. కేవలం దర్శకుడిగానే కాకుండా ‘వైట్ ఫెదర్ ఫిల్మ్స్’ బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ ఆయన సత్తా చాటారు. ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’, ‘ప్లాన్’, ‘యాసిడ్ ఫ్యాక్టరీ’ వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా ఎంతోమంది యువ దర్శకులకు అవకాశాలు కల్పించారు.

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే సంజయ్ గుప్తా.. బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రెండ్స్, నిర్మాణ శైలిపై తన కుండబద్దలు కొట్టే అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. యాక్షన్ డ్రామాలను డార్క్ థీమ్స్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించగల సత్తా ఉన్న ఒక విజనరీ డైరెక్టర్‌ను కోల్పోవడం బాలీవుడ్‌కు తీరని లోటని సినీ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ గుప్తా మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 12:58 pm Digital Edition : Prabhanews
Sanjay Guptha: సినీ ఇంస్ట్రీలో తీవ్ర విషాదం.. వాష్‌రూమ్‌లో జారిపడి ప్రముఖ దర్శకుడు మృతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 31, 2026 12:56 PM ISTబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ స్టార్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు. News18బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ స్టార్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తన నివాసంలోని వాష్‌రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఆయన తలకు తీవ్ర గాయమైందని, ఆ కారణంగానే ఆయన మరణించారని బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉన్న ఆయన హఠాన్మరణం వార్త విని హిందీ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి హీరోలుగా వచ్చిన 'ఆతిష్' చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సంజయ్ గుప్తా, తొలి సినిమాతోనే తన మార్క్ చూపించారు. అయితే 2002లో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి వంటి భారీ తారాగణంతో ఆయన తెరకెక్కించిన 'కాంటే' (Kaante) చిత్రం బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ క్లాసిక్ 'రెజర్వాయర్ డాగ్స్' స్ఫూర్తితో వచ్చిన ఈ మూవీ.. మేకింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా బాలీవుడ్ కు కొత్త ఒరవడిని పరిచయం చేసింది. ఆ తర్వాత ఆయన 'జిందా', 'దస్ కహానియాన్', 'షూటౌట్ ఎట్ వడాలా' వంటి పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.2017లో హృతిక్ రోషన్, యామీ గౌతమ్ జంటగా రూపొందించిన 'కాబిల్' ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. షారుఖ్ ఖాన్ 'రయీస్' కు పోటీగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2024లో ఓటీటీ వేదికగా విడుదలైన 'ది మిరాండా బ్రదర్స్' దర్శకుడిగా ఆయన చివరి చిత్రం. కేవలం దర్శకుడిగానే కాకుండా 'వైట్ ఫెదర్ ఫిల్మ్స్' బ్యానర్ స్థాపించి నిర్మాతగానూ ఆయన సత్తా చాటారు. 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా', 'ప్లాన్', 'యాసిడ్ ఫ్యాక్టరీ' వంటి చిత్రాలను నిర్మించడమే కాకుండా ఎంతోమంది యువ దర్శకులకు అవకాశాలు కల్పించారు.సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే సంజయ్ గుప్తా.. బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రెండ్స్, నిర్మాణ శైలిపై తన కుండబద్దలు కొట్టే అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. యాక్షన్ డ్రామాలను డార్క్ థీమ్స్ తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించగల సత్తా ఉన్న ఒక విజనరీ డైరెక్టర్‌ను కోల్పోవడం బాలీవుడ్‌కు తీరని లోటని సినీ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ గుప్తా మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.మరింత చదవండి

Source link