Last Updated:
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. నేడే (అక్టోబర్ 30) విడుదలైన ఈ సినిమా ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అనే వివరాలు చూద్దామా..
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలకు త్రివిక్రమ్ కేవలం కథ, మాటలు మాత్రమే అందించగా.. తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటీటీ హక్కుల వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్‌లో నారా రోహిత్, నివేదా పెతురాజ్, యువీనా, రాజ్ ప్రజ్వల్ ముఖ్య పాత్రలు పోషించగా.. రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్భీర్ సంధూ, రఘుబాబు తదితరులు తమదైన శైలిలో అలరించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్. థమన్ సంగీతం అందించగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్, పబ్లిసిటీ ఖర్చులు అన్నీ కలిపి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను దాదాపు రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. విపరీతమైన బజ్ ఉండటంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యాయి. నైజాం హక్కులు రూ. 25 కోట్లు, ఆంధ్రా రూ. 18 కోట్లు, సీడెడ్ రూ. 8 కోట్లు, కర్ణాటక-తమిళనాడు రూ. 2 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 4 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 8 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 65 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టాలంటే.. కనీసం రూ. 70 కోట్ల షేర్, లేదా రూ. 140 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు టార్గెట్ నిర్దేశించారు.
ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే శాటిలైట్ హక్కులు రూ. 18 కోట్లకు, మ్యూజిక్ (ఆడియో) హక్కులు రూ. 6 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 6 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఈ చిత్రానికి ఏకంగా రూ. 70 కోట్ల ఆదాయం సమకూరింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనతో నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లెక్కన ‘ఆదర్శ కుటుంబం’ నవంబర్ చివరి వారంలో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పై డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. అయితే బాక్సాఫీస్ దగ్గర సినిమా రన్‌ను బట్టి ఈ ఓటీటీ రిలీజ్ తేదీలో కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది.

