ఈ బోర్డులకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ అగ్రిగేటర్ కంపెనీలు, యజమానులు, పౌర సమాజ సంస్థలు, కార్మిక సంఘాలు, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లతో పాటు సంప్రదాయ అసంఘటిత రంగ కార్మికులకు ఎదురవుతున్న సామాజిక భద్రత లోటును తగ్గించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందించడం, వాటి అమలును పర్యవేక్షించడం, అవసరమైన సూచనలు చేయడం వంటి బాధ్యతలు ఈ బోర్డులకు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)

