వర్షాకాలం వచ్చిందంటే ఎండల నుంచి ఉపశమనం లభించినా, మరోవైపు ఇంట్లో తేమ పెరగడంతో అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది చెదల బెడద. ఒకసారి చెదలు ఇంట్లోకి ప్రవేశిస్తే చెక్క ఫర్నిచర్, తలుపులు, కిటికీలు, అల్మారాలు వంటి వస్తువులను లోపలి నుంచి నెమ్మదిగా తినేస్తాయి. బయటకు ఎలాంటి మార్పు కనిపించకపోయినా, లోపల మాత్రం పూర్తిగా దెబ్బతింటాయి. అందుకే వర్షాకాలంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చెదల సమస్యను చాలా వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

