ప్రభన్యూస్

బ్యాలెట్ పేపర్లతో జరిగినా కాంగ్రెస్‌కు సున్నానే.. 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ సెటైర్లు! |


Last Updated:

నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి బలమైన ఆధిక్యం ప్రదర్శించగా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.

ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బిహార్, మహారాష్ట్రల్లోని 28 శాసన మండలి స్థానాలకు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందో చెప్పగలరా అంటూ ప్రధాని ‘ఎక్స్’ వేదికగా సెటైర్ వేశారు. ఈవీఎంలలో మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ పోస్ట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వెలువడుతున్న తాజా ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. సొంతంగా అధికారంలో ఉన్న కర్ణాటకలోనే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక తీవ్ర ఎదురుదెబ్బ తింది.

కర్ణాటకలో ఎన్డీయే క్లీన్‌స్వీప్.. యూపీలో బీజేపీ హవా

కర్ణాటకలో పోటీ జరిగిన నాలుగు స్థానాల్లోనూ బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. బెంగళూరు టీచర్స్ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టన్నను ఓడించారు. ఈశాన్య టీచర్స్, ఆగ్నేయ పట్టభద్రుల స్థానాలతో పాటు పశ్చిమ పట్టభద్రుల స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అటు ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ ఇప్పటికే లక్నో, బరేలీ, మీరట్ స్థానాలతో కలిపి ఐదింట్లో జయకేతనం ఎగురవేసింది. సమాజ్‌వాదీ పార్టీ వారణాసి, ఆగ్రా టీచర్స్ స్థానాలను గెలుచుకుంది.

బిహార్ శాసనమండలి ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. దర్భంగా టీచర్స్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సురేష్ ప్రసాద్ రాయ్ సిట్టింగ్ కాంగ్రెస్ నేత మదన్ మోహన్ ఝాపై విజయం సాధించారు. తిర్హుత్ స్థానాన్ని బీజేపీ, పట్నా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని జేడీయూ సొంతం చేసుకోగా, ఆర్జేడీ ఒక స్థానాన్ని గెలుచుకుంది.

మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య అయిదు స్థానాలకు హోరాహోరీ పోరు సాగింది. ఓట్ల లెక్కింపు తుది దశకు చేరింది. మొత్తం ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీయే బలపడగా, కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశజనక ప్రదర్శనతో చతికిలపడింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 6:34 pm Digital Edition : Prabhanews
బ్యాలెట్ పేపర్లతో జరిగినా కాంగ్రెస్‌కు సున్నానే.. 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ సెటైర్లు! |

Last Updated:Oct 28, 2026 6:33 PM ISTనాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి బలమైన ఆధిక్యం ప్రదర్శించగా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది.ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బిహార్, మహారాష్ట్రల్లోని 28 శాసన మండలి స్థానాలకు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుచుకుందో చెప్పగలరా అంటూ ప్రధాని 'ఎక్స్' వేదికగా సెటైర్ వేశారు. ఈవీఎంలలో మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ పోస్ట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.వెలువడుతున్న తాజా ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. సొంతంగా అధికారంలో ఉన్న కర్ణాటకలోనే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేక తీవ్ర ఎదురుదెబ్బ తింది.కర్ణాటకలో ఎన్డీయే క్లీన్‌స్వీప్.. యూపీలో బీజేపీ హవాకర్ణాటకలో పోటీ జరిగిన నాలుగు స్థానాల్లోనూ బీజేపీ-జేడీఎస్ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. బెంగళూరు టీచర్స్ స్థానంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుట్టన్నను ఓడించారు. ఈశాన్య టీచర్స్, ఆగ్నేయ పట్టభద్రుల స్థానాలతో పాటు పశ్చిమ పట్టభద్రుల స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అటు ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు లెక్కింపు కొనసాగుతుండగా, బీజేపీ ఇప్పటికే లక్నో, బరేలీ, మీరట్ స్థానాలతో కలిపి ఐదింట్లో జయకేతనం ఎగురవేసింది. సమాజ్‌వాదీ పార్టీ వారణాసి, ఆగ్రా టీచర్స్ స్థానాలను గెలుచుకుంది.
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.Guess how many seats Congress won? 🧐— Narendra Modi (@narendramodi) October 28, 2026బిహార్ శాసనమండలి ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. దర్భంగా టీచర్స్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సురేష్ ప్రసాద్ రాయ్ సిట్టింగ్ కాంగ్రెస్ నేత మదన్ మోహన్ ఝాపై విజయం సాధించారు. తిర్హుత్ స్థానాన్ని బీజేపీ, పట్నా గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని జేడీయూ సొంతం చేసుకోగా, ఆర్జేడీ ఒక స్థానాన్ని గెలుచుకుంది.మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య అయిదు స్థానాలకు హోరాహోరీ పోరు సాగింది. ఓట్ల లెక్కింపు తుది దశకు చేరింది. మొత్తం ఫలితాలను పరిశీలిస్తే ఎన్డీయే బలపడగా, కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశజనక ప్రదర్శనతో చతికిలపడింది.మరింత చదవండి

Source link