సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రేమకథలు సినిమాలను మించి ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వార్తలు వచ్చినా, తమ బంధం గురించి మాత్రం బయటకు పెద్దగా మాట్లాడలేదు. అయితే, వీరి ప్రేమకథకు పునాది వేసింది మాత్రం ‘గీత గోవిందం’ సినిమా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం కోసం రష్మిక కంటే ముందు ఏకంగా 25 మంది హీరోయిన్లను సంప్రదించారనే ప్రచారం ఉంది. చివరకు రష్మిక ఈ ప్రాజెక్ట్‌కు ఎంపిక కావడంతోనే విజయ్‌తో ఆమె పరిచయం ఏర్పడింది. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారి, ఆ తర్వాత ప్రేమగా చిగురించి, పెళ్లి వరకు వెళ్లిందనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు అభిమానుల్లో కనిపిస్తోంది.

