గత నాలుగు సీజన్లలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు ఈ షోకు వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఎపిసోడ్ల సమయంలో వ్యూయర్షిప్ రికార్డులు బద్దలయ్యాయి. అయితే బాలయ్యకు సమకాలికులైన చిరంజీవి లాంటి స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఈ షోలో కనిపించలేదు. ఈ క్రమంలో బి.వి.ఎస్ రవి నేతృత్వంలోని క్రియేటివ్ టీమ్ ఈసారి సీజన్ 5ను మరింత గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది.

