పీఎం కిసాన్ డబ్బుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయాలి.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Farmers Cornerలోని Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
క్యాప్చా వివరాలు నమోదు చేసి, అవసరమైతే రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే OTPతో ధ్రువీకరించండి.
అక్కడ కనిపించే Payment Status, బ్యాంకు పేరు, UTR నంబర్, ఖాతాలో డబ్బులు జమ అయిన తేదీ వంటి వివరాలను పరిశీలించండి.
రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత ఆప్షన్ల ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. అలాగే Beneficiary Listలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలు ఎంచుకుని లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూడవచ్చు.

