ప్రభన్యూస్

Pesara Garelu Recipe: కరకరలాడే పెసర గారెల సీక్రెట్ ఇదే.. పిండి కలిపేటప్పుడు ఈ తప్పులు చేయకండి! | లైఫ్ స్టైల్


Last Updated:

సర గారెలు సూపర్ టిఫిన్. మినప గారెలకు భిన్నంగా వీటిని పెసరపప్పుతో తయారు చేస్తారు. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ గారెలను ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు. సరైన పద్ధతిలో పిండి సిద్ధం చేసుకుని, తగిన మంటపై వేయిస్తే గారెలు మంచిగ వస్తాయి.

News18
News18

పెసర గారెలు సూపర్ టిఫిన్. మినప గారెలకు భిన్నంగా వీటిని పెసరపప్పుతో తయారు చేస్తారు. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ గారెలను ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు. ముఖ్యంగా వేడివేడిగా తయారు చేసిన పెసర గారెలను ఘాటైన కారం చట్నీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. సరైన పద్ధతిలో పిండి సిద్ధం చేసుకుని, తగిన మంటపై వేయిస్తే గారెలు మంచి షేప్‌లో వస్తాయి.

పెసర గారెల తయారీకి 400 గ్రాముల పెసరపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక అంగుళం అల్లం ముక్క, ఆరు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అర చెంచా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి నూనె తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు మెత్తబడి సులభంగా రుబ్బుకోవచ్చు. పప్పు బాగా నానిన తర్వాత నీటిని వంపేసి, చిల్లుల గిన్నెలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. పప్పులో నీరు ఎక్కువగా ఉంటే పిండి పల్చగా మారుతుంది. అందుకే నీటిని పూర్తిగా వంపేయడం ముఖ్యం. అందులోంచి రెండు చెంచాల పప్పును పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పును కొద్దికొద్దిగా వేసి, నీరు కలపకుండా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉంటే గారెలు బాగా వస్తాయి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన పెట్టుకున్న పప్పు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కరివేపాకును కూడా చేర్చుకోవచ్చు.

తర్వాత అరచేతికి కొద్దిగా నీరు రాసుకుని పిండిని చిన్న ఉండలుగా తీసుకోవాలి. అరిటాకు లేదా కవర్‌పై పెట్టి పల్చగా వత్తి, మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల గారెలు సమానంగా వేగుతాయి. బాణలిలో నూనె వేడి చేసి, మంటను మీడియంలో ఉంచాలి. గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత వాటిని తీసి అదనపు నూనె వడగట్టాలి.

కరకరలాడే పెసర గారెలను వేడివేడిగా ఘాటైన కారం చట్నీతో వడ్డించండి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవడం, గారెలను మరీ మందంగా వత్తకపోవడం, మీడియం మంటపై వేయించడం ఈ వంటకంలో ముఖ్యమైన చిట్కాలు. ఇలా చేస్తే ఇంట్లోనే రుచికరమైన పెసర గారెలను సులభంగా తయారు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 7:19 am Digital Edition : Prabhanews
Pesara Garelu Recipe: కరకరలాడే పెసర గారెల సీక్రెట్ ఇదే.. పిండి కలిపేటప్పుడు ఈ తప్పులు చేయకండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 25, 2026 7:11 AM ISTసర గారెలు సూపర్ టిఫిన్. మినప గారెలకు భిన్నంగా వీటిని పెసరపప్పుతో తయారు చేస్తారు. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ గారెలను ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు. సరైన పద్ధతిలో పిండి సిద్ధం చేసుకుని, తగిన మంటపై వేయిస్తే గారెలు మంచిగ వస్తాయి.News18పెసర గారెలు సూపర్ టిఫిన్. మినప గారెలకు భిన్నంగా వీటిని పెసరపప్పుతో తయారు చేస్తారు. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ గారెలను ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తినవచ్చు. ముఖ్యంగా వేడివేడిగా తయారు చేసిన పెసర గారెలను ఘాటైన కారం చట్నీతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. సరైన పద్ధతిలో పిండి సిద్ధం చేసుకుని, తగిన మంటపై వేయిస్తే గారెలు మంచి షేప్‌లో వస్తాయి.పెసర గారెల తయారీకి 400 గ్రాముల పెసరపప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక అంగుళం అల్లం ముక్క, ఆరు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అర చెంచా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి నూనె తీసుకోవాలి. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు మెత్తబడి సులభంగా రుబ్బుకోవచ్చు. పప్పు బాగా నానిన తర్వాత నీటిని వంపేసి, చిల్లుల గిన్నెలో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. పప్పులో నీరు ఎక్కువగా ఉంటే పిండి పల్చగా మారుతుంది. అందుకే నీటిని పూర్తిగా వంపేయడం ముఖ్యం. అందులోంచి రెండు చెంచాల పప్పును పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పును కొద్దికొద్దిగా వేసి, నీరు కలపకుండా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉంటే గారెలు బాగా వస్తాయి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, పక్కన పెట్టుకున్న పప్పు గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే కరివేపాకును కూడా చేర్చుకోవచ్చు.తర్వాత అరచేతికి కొద్దిగా నీరు రాసుకుని పిండిని చిన్న ఉండలుగా తీసుకోవాలి. అరిటాకు లేదా కవర్‌పై పెట్టి పల్చగా వత్తి, మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల గారెలు సమానంగా వేగుతాయి. బాణలిలో నూనె వేడి చేసి, మంటను మీడియంలో ఉంచాలి. గారెలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత వాటిని తీసి అదనపు నూనె వడగట్టాలి.కరకరలాడే పెసర గారెలను వేడివేడిగా ఘాటైన కారం చట్నీతో వడ్డించండి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవడం, గారెలను మరీ మందంగా వత్తకపోవడం, మీడియం మంటపై వేయించడం ఈ వంటకంలో ముఖ్యమైన చిట్కాలు. ఇలా చేస్తే ఇంట్లోనే రుచికరమైన పెసర గారెలను సులభంగా తయారు చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link