ప్రభన్యూస్

Priya vadhana Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల సినీ నటి మృతి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ న్యూస్ రీడర్, నటి ప్రియవదన (24) మృతి చెందారు. చిన్న వయసులోనే మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియ, అర్ధాంతరంగా తనువు చాలించింది.

News18
News18

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ రీడర్, నటి ప్రియవదన (24) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబర్ 21న ఆమె తుదిశ్వాస విడిచినట్లు చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయసులోనే మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియ, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తమిళ బుల్లితెర, వెండితెర వర్గాలను కలచివేసింది.

ప్రియ వదన జర్నలిజంపై ఉన్న మక్కువతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. స్పష్టమైన వాక్చాతుర్యం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. న్యూస్ రీడర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిగా స్థిరపడాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు అందుకుని, నటిగా బిజీ అవుతుందని స్నేహితులు, శ్రేయోభిలాషులు భావించారు.

అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ప్రియ మరణవార్త పిడుగులా మీద పడింది. విశేషమేమిటంటే, ఆమె ఇటీవలే తన 24వ పుట్టినరోజును అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియ, తన కెరీర్ కు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకునేవారు. అలాంటి ఉత్సాహవంతమైన యువతి అకస్మాత్తుగా ఎందుకు మరణించిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కొన్ని తమిళ మీడియా కథనాల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? వ్యక్తిగత సమస్యలా, లేక కెరీర్ పరమైన ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ తర్వాత అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఏది ఏమైనా, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ ప్రతిభావంతురాలు ఇలా చిన్న వయసులోనే లోకాన్ని విడిచివెళ్లడం పట్ల నెటిజన్లు, తోటి జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ ఘటన సినీ, మీడియా రంగాల్లో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను మరోసారి తెరపైకి తెచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 October 2026, 12:44 pm Digital Edition : Prabhanews
Priya vadhana Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల సినీ నటి మృతి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 24, 2026 12:41 PM ISTప్రముఖ న్యూస్ రీడర్, నటి ప్రియవదన (24) మృతి చెందారు. చిన్న వయసులోనే మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియ, అర్ధాంతరంగా తనువు చాలించింది.
News18కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ రీడర్, నటి ప్రియవదన (24) ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబర్ 21న ఆమె తుదిశ్వాస విడిచినట్లు చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయసులోనే మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియ, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తమిళ బుల్లితెర, వెండితెర వర్గాలను కలచివేసింది.ప్రియ వదన జర్నలిజంపై ఉన్న మక్కువతో మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. స్పష్టమైన వాక్చాతుర్యం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. న్యూస్ రీడర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిగా స్థిరపడాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు అందుకుని, నటిగా బిజీ అవుతుందని స్నేహితులు, శ్రేయోభిలాషులు భావించారు.అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ప్రియ మరణవార్త పిడుగులా మీద పడింది. విశేషమేమిటంటే, ఆమె ఇటీవలే తన 24వ పుట్టినరోజును అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియ, తన కెరీర్ కు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకునేవారు. అలాంటి ఉత్సాహవంతమైన యువతి అకస్మాత్తుగా ఎందుకు మరణించిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కొన్ని తమిళ మీడియా కథనాల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? వ్యక్తిగత సమస్యలా, లేక కెరీర్ పరమైన ఒత్తిడి ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ తర్వాత అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.ఏది ఏమైనా, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువ ప్రతిభావంతురాలు ఇలా చిన్న వయసులోనే లోకాన్ని విడిచివెళ్లడం పట్ల నెటిజన్లు, తోటి జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ ఘటన సినీ, మీడియా రంగాల్లో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లను మరోసారి తెరపైకి తెచ్చింది.మరింత చదవండి

Source link