ఇంట్లో డైనింగ్ టేబుల్, సోఫా ఫ్రేమ్, అల్మారా, సెంటర్ టేబుల్ వంటి చెక్క వస్తువులు ఉంటే గదులకు ప్రత్యేకమైన అందం వస్తుంది. ఇవి ఇంటికి సంప్రదాయ, ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. అయితే రోజులు గడిచేకొద్దీ దుమ్ము, తేమ, మరకలు, నిత్యం ఉపయోగించడం వంటి కారణాలతో చెక్క ఫర్నిచర్‌పై మెరుపు తగ్గిపోతుంది. దీంతో కొత్తగా కొన్నప్పుడు ఉన్న అందం క్రమంగా కనుమరుగవుతుంది. కానీ కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే ఖరీదైన ఫర్నిచర్‌ను ఎక్కువ కాలం కొత్తదానిలా ఉంచుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఖర్చులు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.

