కెన్యా రాజధాని నైరోబీలో భారీ భవనం కుప్పకూలింది. అక్టోబర్ 23, శుక్రవారం నిర్మాణంలో ఉన్న 12 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నైరోబీ కౌంటీ గవర్నర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కూలిపోయిన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Source link
