ప్రభన్యూస్

SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్… ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ | SBI Funds IPO Sees Strong Demand Grey Market Premium Hits Rs 94 | బిజినెస్


Last Updated:

SBI Funds IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సబ్‌స్క్రిప్షన్, గ్రే మార్కెట్ ప్రీమియం, కంపెనీ ఆర్థిక ఫలితాలు వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్... ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ (ప్రతీకాత్మక చిత్రం)
SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్… ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ (ప్రతీకాత్మక చిత్రం)

భారతదేశంలో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తన ఐపీఓను ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం జూలై 14న సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇష్యూకు మొత్తం 68 శాతం సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. బిడ్డింగ్ రెండో రోజు కూడా ఈ ఐపీఓకు మంచి స్పందన కొనసాగిందని మనీకంట్రోల్ కథనం వివరించింది. రూ.9,813 కోట్ల పబ్లిక్ ఇష్యూకు జూలై 15 మధ్యాహ్నం 12:48 గంటల వరకు దాదాపు 1.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. మొత్తం 12.45 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా, పెట్టుబడిదారులు 18.40 కోట్ల షేర్ల కోసం బిడ్లు వేశారు. ఇందులో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్‌ఐఐలు) విభాగంలో అత్యధిక డిమాండ్ నమోదై దాదాపు 3.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (ఆర్‌ఐఐలు) విభాగంలో 1.16 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. అంటే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవల రీటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటం వల్ల, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

“ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ పెద్ద మొత్తంలో రావడం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న కీలక మార్పులకు కూడా ఇది ఒక ప్రతిబింబంగా నిలుస్తోంది. గత పదేళ్లలో భారతీయుల పొదుపు చేసే విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు, ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్‌ఐపీలు) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఆర్థిక అవగాహన పెరగడం, పెట్టుబడి అవకాశాలు సులభంగా అందుబాటులోకి రావడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడం వంటి మార్పులకు ఇది నిదర్శనం” అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ, బ్లూస్ట్రైడ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్ బొమ్మెన న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు.

ఇది కూడా చదవండి: Fastest Trains: వందే భారత్ రైలు ఒక్కటే కాదు… ఇండియాలో ఇవి కూడా ఫాస్టెస్ట్ ట్రైన్స్

పెట్టుబడిదారుల ఆసక్తి గ్రే మార్కెట్‌లో కూడా కనిపిస్తోంది. ఇన్వెస్టర్‌గెయిన్, ఐపీఓ వాచ్ వివరాల ప్రకారం ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఒక్కో షేరుకు సుమారు రూ.94గా ఉంది. అంటే గరిష్ఠ ధర అయిన రూ.574తో పోలిస్తే సుమారు 16.38 శాతం లిస్టింగ్ లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో లిస్టింగ్ ధర ఒక్కో షేరు సుమారు రూ.668 ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఐపీఓ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.545 నుంచి రూ.574గా కంపెనీ నిర్ణయించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్). మొత్తం 20.37 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయానికి వస్తున్నాయి. ఈ ఆఫర్ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు రావు. వచ్చిన మొత్తం డబ్బు అమ్మకందారులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), అముండి ఇండియా హోల్డింగ్‌కు వెళ్తుంది. షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 17న పూర్తయ్యే అవకాశం ఉంది. జూలై 21న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో షేర్లు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

“ఇలాంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కావడం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు మరో సంకేతంగా చెప్పొచ్చు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అసెట్ మేనేజ్‌మెంట్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది లక్షలాది కుటుంబాలను మూలధన మార్కెట్లతో అనుసంధానించడమే కాకుండా, వారి దీర్ఘకాలిక పొదుపులను ఉత్పాదక పెట్టుబడులుగా మార్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సంప్రదాయ పరిశ్రమలతో పోలిస్తే ఈ రంగం మేధోసంపత్తి, పెట్టుబడిదారుల నమ్మకం, టెక్నాలజీ, బలమైన పంపిణీ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ రంగం వృద్ధి పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుదలకు దగ్గరగా ముడిపడి ఉండటంతో, దేశ ఆర్థిక పరిపక్వతకు ఇది ఒక ముఖ్యమైన సూచికగా భావిస్తున్నారు. ఈ ఐపీఓ భారత మూలధన మార్కెట్లు ఎలా విస్తరిస్తున్నాయో కూడా చూపిస్తోంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలతో పాటు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి సేవలు అందించే సంస్థలు కూడా ఇప్పుడు లిస్టెడ్ కంపెనీల్లో కీలక స్థానం సంపాదిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోందని, మరింత పరిపక్వత సాధిస్తోందని సూచిస్తోంది” అని అక్షయ్ కుమార్ బొమ్మెన అన్నారు.

1992లో స్థాపించబడిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇది ఎస్‌బీఐ, అముండి కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. 2025 నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎమ్) సుమారు రూ.16.32 లక్షల కోట్లు. దీంతో భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15.5 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బలమైన ఆర్థిక ఫలితాలు, గ్రే మార్కెట్‌లో కనిపిస్తున్న సానుకూల సంకేతాలు, బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులు ఈ ఐపీఓపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఏ ఐపీఓలోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 2:56 pm Digital Edition : Prabhanews
SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్… ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ | SBI Funds IPO Sees Strong Demand Grey Market Premium Hits Rs 94 | బిజినెస్

Last Updated:Jul 15, 2026 1:30 PM ISTSBI Funds IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా ఉన్న ఈ సంస్థ ఐపీఓలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన సబ్‌స్క్రిప్షన్, గ్రే మార్కెట్ ప్రీమియం, కంపెనీ ఆర్థిక ఫలితాలు వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.SBI Funds IPO: ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓకు మంచి రెస్పాన్స్... ఒక్కో షేరుకు రూ.94 జీఎంపీ (ప్రతీకాత్మక చిత్రం)భారతదేశంలో అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ తన ఐపీఓను ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం జూలై 14న సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇష్యూకు మొత్తం 68 శాతం సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. బిడ్డింగ్ రెండో రోజు కూడా ఈ ఐపీఓకు మంచి స్పందన కొనసాగిందని మనీకంట్రోల్ కథనం వివరించింది. రూ.9,813 కోట్ల పబ్లిక్ ఇష్యూకు జూలై 15 మధ్యాహ్నం 12:48 గంటల వరకు దాదాపు 1.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. మొత్తం 12.45 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా, పెట్టుబడిదారులు 18.40 కోట్ల షేర్ల కోసం బిడ్లు వేశారు. ఇందులో నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్‌ఐఐలు) విభాగంలో అత్యధిక డిమాండ్ నమోదై దాదాపు 3.5 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ (ఆర్‌ఐఐలు) విభాగంలో 1.16 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. అంటే పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవల రీటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటం వల్ల, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు."ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ పెద్ద మొత్తంలో రావడం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న కీలక మార్పులకు కూడా ఇది ఒక ప్రతిబింబంగా నిలుస్తోంది. గత పదేళ్లలో భారతీయుల పొదుపు చేసే విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులతో పాటు, ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్‌ఐపీలు) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఆర్థిక అవగాహన పెరగడం, పెట్టుబడి అవకాశాలు సులభంగా అందుబాటులోకి రావడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడం వంటి మార్పులకు ఇది నిదర్శనం" అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ, బ్లూస్ట్రైడ్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్ బొమ్మెన న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు.ఇది కూడా చదవండి: Fastest Trains: వందే భారత్ రైలు ఒక్కటే కాదు... ఇండియాలో ఇవి కూడా ఫాస్టెస్ట్ ట్రైన్స్పెట్టుబడిదారుల ఆసక్తి గ్రే మార్కెట్‌లో కూడా కనిపిస్తోంది. ఇన్వెస్టర్‌గెయిన్, ఐపీఓ వాచ్ వివరాల ప్రకారం ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ఒక్కో షేరుకు సుమారు రూ.94గా ఉంది. అంటే గరిష్ఠ ధర అయిన రూ.574తో పోలిస్తే సుమారు 16.38 శాతం లిస్టింగ్ లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో లిస్టింగ్ ధర ఒక్కో షేరు సుమారు రూ.668 ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఐపీఓ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.545 నుంచి రూ.574గా కంపెనీ నిర్ణయించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్). మొత్తం 20.37 కోట్ల ఈక్విటీ షేర్లు విక్రయానికి వస్తున్నాయి. ఈ ఆఫర్ ద్వారా కంపెనీకి ఎలాంటి నిధులు రావు. వచ్చిన మొత్తం డబ్బు అమ్మకందారులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), అముండి ఇండియా హోల్డింగ్‌కు వెళ్తుంది. షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 17న పూర్తయ్యే అవకాశం ఉంది. జూలై 21న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో షేర్లు లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది."ఇలాంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కావడం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు మరో సంకేతంగా చెప్పొచ్చు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అసెట్ మేనేజ్‌మెంట్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది లక్షలాది కుటుంబాలను మూలధన మార్కెట్లతో అనుసంధానించడమే కాకుండా, వారి దీర్ఘకాలిక పొదుపులను ఉత్పాదక పెట్టుబడులుగా మార్చడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సంప్రదాయ పరిశ్రమలతో పోలిస్తే ఈ రంగం మేధోసంపత్తి, పెట్టుబడిదారుల నమ్మకం, టెక్నాలజీ, బలమైన పంపిణీ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ రంగం వృద్ధి పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుదలకు దగ్గరగా ముడిపడి ఉండటంతో, దేశ ఆర్థిక పరిపక్వతకు ఇది ఒక ముఖ్యమైన సూచికగా భావిస్తున్నారు. ఈ ఐపీఓ భారత మూలధన మార్కెట్లు ఎలా విస్తరిస్తున్నాయో కూడా చూపిస్తోంది. బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, డిపాజిటరీలతో పాటు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడి సేవలు అందించే సంస్థలు కూడా ఇప్పుడు లిస్టెడ్ కంపెనీల్లో కీలక స్థానం సంపాదిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోందని, మరింత పరిపక్వత సాధిస్తోందని సూచిస్తోంది" అని అక్షయ్ కుమార్ బొమ్మెన అన్నారు.1992లో స్థాపించబడిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఇది ఎస్‌బీఐ, అముండి కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. 2025 నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎమ్) సుమారు రూ.16.32 లక్షల కోట్లు. దీంతో భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15.5 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బలమైన ఆర్థిక ఫలితాలు, గ్రే మార్కెట్‌లో కనిపిస్తున్న సానుకూల సంకేతాలు, బ్రోకరేజ్ సంస్థల సిఫార్సులు ఈ ఐపీఓపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఏ ఐపీఓలోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link