Last Updated:
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులకు ఓ అద్భుతమైన కానుక ఇచ్చింది కల్కి టీమ్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులకు ఓ అద్భుతమైన కానుక ఇచ్చింది కల్కి టీమ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న ఎపిక్ సీక్వెల్ ‘కల్కి 2’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘కల్కి’ తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అందులో భైరవ పాత్రలో ప్రభాస్ యాక్షన్, ఫ్యూచరిస్టిక్ బుజ్జి వాహనంతో ఆయన చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి. తాజాగా విడుదల చేసిన బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్‌లో భైరవ పాత్రను మరింత పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్‌గా చూపించి, సీక్వెల్‌పై ఉన్న అంచనాలను మేకర్స్ అమాంతం పెంచేశారు.
To the superhero of Indian Cinema…
Happy Birthday to the Darling of every generation, Rebel Star #Prabhas.
We are excited to embark on another epic cinematic journey with you… #Kalki2898AD ⚡ https://t.co/uE5GQAOr4c— Kalki 2898 AD (@Kalki2898AD) October 23, 2026
‘కల్కి 2898 ఏడీ’ తొలి భాగం క్లైమాక్స్ ఎక్కడైతే ఉత్కంఠభరితంగా ముగిసిందో.. సరిగ్గా అక్కడి నుంచే పార్ట్-2 కథ ప్రారంభం కానుంది. రెండో భాగంలో తొలి భాగం కంటే అద్భుతమైన భవిష్యత్తు ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా విలన్ సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్), సుమతి (దీపికా పదుకొనే) పాత్రల చుట్టూ అల్లిన కథలోని కీలక మలుపులు రెండో భాగంలో రివీల్ కానున్నాయి. భైరవ అసలు గతం, కర్ణుడి అంశతో అతడికి అశ్వత్థామకు మధ్య జరిగే పోరాటాలు, కాంప్లెక్స్ – శంభల మధ్య జరిగే యుద్ధం కల్కి 2లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఈ వీడియో సినీవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోతోనే కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ తేదీ ఖరారైనట్లు కాదు. ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే దానిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై అభిమానులు బోలెడు ఆశలతో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, హను రాఘవపూడి ఫౌజీ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, కల్కి 2 పై మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు.

