డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తింపు, వయసు, నివాస ధ్రువీకరణకు ఉపయోగించగల పత్రాల వివరాలను కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, ఈ-రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం సహా ఇతర పత్రాలు ఉన్నాయి. లైసెన్సింగ్ అధికారులు కొత్తగా జారీ చేసే లేదా రెన్యువల్ చేసే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌ను లామినేషన్ చేసిన కార్డు రూపంలో లేదా పాలీవినైల్ క్లోరైడ్ (PVC) కార్డుపై జారీ చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ఫారం 7లో లైసెన్స్ ఇవ్వాలని ముసాయిదా నిబంధనలు సూచిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

