Last Updated:
ప్రతి పౌరుడూ దైవమే.. రాముడి ఆదర్శాలను గుర్తుచేస్తూ మోదీ ఉద్వేగభరిత ప్రసంగం!
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగ వేళ దేశ రాజధానిలో ఉత్సాహం అంబరాన్నంటింది. న్యూఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్ ఉత్సవ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన విజయదశమి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వందల ఏళ్ల పాటు విదేశీయుల దండయాత్రలు, దోపిడీలకు గురైన భారతదేశం.. ఇప్పుడు తన అస్థిత్వాన్ని, ఘనమైన వారసత్వాన్ని తిరిగి దక్కించుకుంటోందని ఈ వేదికగా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
అందుకే మనం ఎల్లప్పుడూ ప్రజలను సాక్షాత్తూ దేవుడి స్వరూపంగా (జనార్దన్) భావించాలని ప్రధాని సూచించారు. ‘నాగ్రిక్ దేవో భవ’ (ప్రతి పౌరుడూ దైవమే) అనే గొప్ప మూల సూత్రంతో ప్రభుత్వాలు, వ్యవస్థలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మోదీ దిశానిర్దేశం చేశారు.

