ప్రభన్యూస్

ముంబైకి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి.. జైశంకర్‌తో సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథేంటి? |


Last Updated:

26/11 బాధితులకు అమెరికా మంత్రి నివాళులు.. ముంబైలో మార్కో రూబియో కీలక పర్యటన!

News18
News18

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ముంబై చేరుకున్నారు. అక్కడ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో ఆయన ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. కొలాబాలోని చారిత్రక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జైశంకర్, రూబియోతో పాటు అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ చర్చల్లో పాలుపంచుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, విధానపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఉన్నతస్థాయి పర్యటనకు తీవ్ర ప్రాధాన్యం ఏర్పడింది.

భారత్, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ రంగం, ఇంధన సహకారం, పశ్చిమాసియాలో మారుతున్న తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటనపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. అమెరికా విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ, ద్వైపాక్షిక సంబంధాల్లోని వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశంగా ఆయన అభివర్ణించారు. వ్యూహాత్మక భాగస్వామ్య మూలస్తంభాలను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ration Card Holders Good News: పండుగ వేళ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం భారీ శుభవార్త.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు!

ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ సమస్యలను పరిష్కరించడం, నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించి మార్కెట్ అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా 2025 ప్రారంభం నుంచి రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. భారత్‌కు రాకముందు ఉజ్బెకిస్థాన్‌లో మాట్లాడిన రూబియో, వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లపై జాతీయ భద్రతా మినహాయింపులు ఇచ్చే విషయంలో ఈ వాణిజ్య ఒప్పందాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరుకుందని మంత్రి జైశంకర్ కూడా ఇటీవల వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Mutton: రూ.500కే కేజీ మటన్.. ఇక మందు కొంటే ఫ్రీగానే! మద్యం, మాంసం ప్రియులకు పండగే!

భారత్, అమెరికా సంబంధాలు ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియపై ఆంక్షలు భారత్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగ నిపుణులు, ఐటీ కంపెనీలపై ఈ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటికి తోడు ఇమ్మిగ్రేషన్ విధానాలు, 2025 మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల తగ్గింపులో తమ పాత్ర ఉందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు కూడా ఇరు దేశాల మధ్య కొంత అసంతృప్తికి దారితీశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి.

ముంబై పర్యటనలో భాగంగా మార్కో రూబియో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు తాజ్ స్మారకం వద్ద ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక రిసెప్షన్‌లో పాల్గొంటారు. బుధవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనం అవుతారు. ఈ ఏడాదిలో రూబియో భారత్‌కు రావడం ఇది రెండోసారి. మే నెలలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడా విస్తృత స్థాయి చర్చలు జరిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 5:27 pm Digital Edition : Prabhanews
ముంబైకి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి.. జైశంకర్‌తో సీక్రెట్ మీటింగ్ వెనుక అసలు కథేంటి? |

Last Updated:Oct 20, 2026 5:26 PM IST26/11 బాధితులకు అమెరికా మంత్రి నివాళులు.. ముంబైలో మార్కో రూబియో కీలక పర్యటన!News18అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ముంబై చేరుకున్నారు. అక్కడ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌తో ఆయన ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. కొలాబాలోని చారిత్రక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన ఈ కీలక సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జైశంకర్, రూబియోతో పాటు అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ చర్చల్లో పాలుపంచుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, విధానపరమైన విభేదాలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఉన్నతస్థాయి పర్యటనకు తీవ్ర ప్రాధాన్యం ఏర్పడింది.భారత్, అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ప్రధానంగా ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ రంగం, ఇంధన సహకారం, పశ్చిమాసియాలో మారుతున్న తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ పర్యటనపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. అమెరికా విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ, ద్వైపాక్షిక సంబంధాల్లోని వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశంగా ఆయన అభివర్ణించారు. వ్యూహాత్మక భాగస్వామ్య మూలస్తంభాలను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Ration Card Holders Good News: పండుగ వేళ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం భారీ శుభవార్త.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు!ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ సమస్యలను పరిష్కరించడం, నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించి మార్కెట్ అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా 2025 ప్రారంభం నుంచి రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. భారత్‌కు రాకముందు ఉజ్బెకిస్థాన్‌లో మాట్లాడిన రూబియో, వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లపై జాతీయ భద్రతా మినహాయింపులు ఇచ్చే విషయంలో ఈ వాణిజ్య ఒప్పందాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరుకుందని మంత్రి జైశంకర్ కూడా ఇటీవల వెల్లడించారు.
#WATCH | Mumbai, Maharashtra: EAM Dr S Jaishankar meets US Secretary of State, Marco Rubio. US Ambassador Sergio Gor and Foreign Secretary Vikram Misri were also present. https://t.co/WfcyEtKmqp
— ANI (@ANI) October 20, 2026ఇది కూడా చదవండి: Mutton: రూ.500కే కేజీ మటన్.. ఇక మందు కొంటే ఫ్రీగానే! మద్యం, మాంసం ప్రియులకు పండగే!భారత్, అమెరికా సంబంధాలు ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. హెచ్-1బీ వీసా ఫీజుల పెంపు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియపై ఆంక్షలు భారత్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగ నిపుణులు, ఐటీ కంపెనీలపై ఈ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటికి తోడు ఇమ్మిగ్రేషన్ విధానాలు, 2025 మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల తగ్గింపులో తమ పాత్ర ఉందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు కూడా ఇరు దేశాల మధ్య కొంత అసంతృప్తికి దారితీశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి.ముంబై పర్యటనలో భాగంగా మార్కో రూబియో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు తాజ్ స్మారకం వద్ద ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక రిసెప్షన్‌లో పాల్గొంటారు. బుధవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు పయనం అవుతారు. ఈ ఏడాదిలో రూబియో భారత్‌కు రావడం ఇది రెండోసారి. మే నెలలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడా విస్తృత స్థాయి చర్చలు జరిపారు.మరింత చదవండి

Source link