‘వారణాసి’ చిత్రం ప్రధానంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం సైన్స్ ఫిక్షన్‌కే పరిమితం కాదని, పౌరాణిక (Mythological) అంశాలతో కూడిన అద్భుతమైన విజువల్ ఫాంటసీ వండర్‌గా ఉండబోతుందని జక్కన్న స్పష్టం చేశారు. “ఇందులో యాక్షన్, థ్రిల్స్‌తో పాటు ఎమోషన్స్‌కు చాలా పెద్ద పీట వేశాం. తండ్రీకొడుకుల మధ్య ఉండే సున్నితమైన, బలమైన అనుబంధం, అలాగే ఒక యువతీయువకుడి మధ్య సాగే ఎంతో అందమైన ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇది ఒకే కథలా కాకుండా.. ఆరేడు విభిన్నమైన కథలను, సినిమాలను కలిపి ఒకే భారీ ఎపిక్ చిత్రంగా మలిచినట్లు ఉంటుంది. వాటన్నింటినీ సజావుగా కలపడమే ‘వారణాసి’ రూపకల్పనలో మాకు ఎదురైన అతిపెద్ద సవాలు” అని రాజమౌళి వివరించారు.

