Night Leg Cramps: రోజంతా హడావుడిగా పనిచేసి అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి కాళ్లలో తీవ్రమైన పోటు లేదా తిమ్మిర్లు రావడం చాలామందిలో చూస్తుంటామని 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరిస్తున్నారు. నిద్రలో అకస్మాత్తుగా పిక్కల్లో నరాలు పట్టేయడం (నోక్టర్నల్ లెగ్ క్రాంప్స్), పిక్క కండరాలు గట్టిగా ముడుచుకుపోయి విలవిల్లాడేలా చేయడం, పాదాలు స్పర్శ కోల్పోయినట్లు మొద్దుబారడం వంటివి నిద్రకు తీవ్ర భంగం కలిగిస్తాయని స్పష్టం చేస్తున్నారు. చాలామంది దీనిని సాధారణ నలతగానో లేదా రోజంతా నడిచిన అలసటగానో భావించి తేలికగా తీసుకుంటారని తెలుపుతున్నారు. కానీ రాత్రిపూట పదేపదే కాళ్లలో తీవ్రమైన తిమ్మిర్లు, కండరాలు పట్టేయడం అనేది శరీరంలోని పోషకాహార లోపాలు, నాడీ వ్యవస్థ లేదా రక్త ప్రసరణ సమస్యలను తెలియజేసే బలమైన హెచ్చరిక సంకేతమని హెచ్చరిస్తున్నారు. రాత్రివేళ కాళ్లలో తిమ్మిర్లు రావడానికి దారితీసే ఆ 5 ప్రధాన కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

