ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: ఒరేయ్ మీ రొమాన్స్ తగిలెయ్య.. ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా? బెడ్ రూమ్ అనుకుంటున్నారా?.. ఏం కర్మరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం ఎపిసోడ్‌లో రోహిత్, షాలిని మధ్య ఉన్న అనుబంధం అందరినీ కదిలించింది. నామినేషన్లలో ఉన్న రోహిత్ సేఫ్ అవ్వగా.. చివరికి షాలిని, వర్షిణి మాత్రమే మిగిలారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ నెలకొంది.

News18
News18

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం ఎపిసోడ్‌లో రోహిత్, షాలిని మధ్య ఉన్న అనుబంధం అందరినీ కదిలించింది. నామినేషన్లలో ఉన్న రోహిత్ సేఫ్ అవ్వగా.. చివరికి షాలిని, వర్షిణి మాత్రమే మిగిలారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ నెలకొంది. చివరకు షాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. షాలిని తనకు దూరమవుతుందనే బాధను తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు.

రోహిత్‌ను అలా చూసిన షాలిని కూడా ఎమోషనల్ అయింది. హౌస్‌లో తనతో కలిసి ప్రయాణించిన రోహిత్‌కు ధైర్యం చెబుతూ కొన్ని మాటలు చెప్పింది. గేమ్‌ను బాగా ఆడాలని, ఎలాగైనా విన్నర్ ట్రోఫీ తీసుకుని రావాలని కోరింది. అంతేకాకుండా రోహిత్‌కు ముద్దుపెట్టి మరీ ‘లవ్ యూ’ అని చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి హైలైట్ అయింది. షాలిని వెళ్లిపోతున్న సమయంలో రోహిత్‌ను హత్తుకుని చాలాసేపు మాట్లాడింది. ఈ ఎమోషనల్ సీన్‌తో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని స్టేజీ మీదకు చేరుకుంది. అక్కడ తన జర్నీకి సంబంధించిన ఏవీని చూసి మురిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన క్షణాలు, తోటి కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాలు తెరపై కనిపించడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. తన ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆనందించింది. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా రోహిత్, షాలిని మధ్య ఉన్న బాండింగ్ గురించి మరోసారి ఆసక్తికరమైన చర్చ జరిగింది.

తన జర్నీ గురించి మాట్లాడుతూ షాలిని రోహిత్‌ను గుర్తు చేసుకుంది. “నా జర్నీ మొత్తం నువ్వే ఉన్నావ్‌రా. మన జర్నీ చాలా బాగుంది” అంటూ అతడితో చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో అర్థమైంది. హౌస్‌లో కలిసి గడిపిన రోజులు, ఒకరికొకరు తోడుగా నిలిచిన సందర్భాలను షాలిని తన మాటల్లో గుర్తు చేసుకుంది.

ఆ తర్వాత నాగార్జున మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. షాలిని స్థానంలో ఎవరెవరు ఎలిమినేట్ కావాల్సి ఉందో ముగ్గురి పేర్లు చెప్పాలని కోరారు. దీనికి ఆమె వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను చెప్పింది. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్ల పేర్లు మరోసారి చర్చకు వచ్చాయి.

అయితే షాలిని హౌస్ నుంచి వెళ్లిపోతుందని అందరూ అనుకుంటున్న సమయంలో నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. షాలినిని పిలిచి, “నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు.. సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నావ్” అని ప్రకటించారు. దీంతో షాలినికి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా షాక్ తగిలింది. రోహిత్‌కు దూరమవుతున్నానని బాధపడిన షాలిని తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందనే ఆసక్తి మొదలైంది. ఇక వచ్చే వారం ఎపిసోడ్‌ను ‘గోట్ – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అంటూ నాగార్జున పరిచయం చేశారు. మొత్తానికి రోహిత్, షాలిని మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో పాటు సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌తో ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 2:48 pm Digital Edition : Prabhanews
Bigg Boss Telugu 10: ఒరేయ్ మీ రొమాన్స్ తగిలెయ్య.. ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా? బెడ్ రూమ్ అనుకుంటున్నారా?.. ఏం కర్మరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 2:39 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం ఎపిసోడ్‌లో రోహిత్, షాలిని మధ్య ఉన్న అనుబంధం అందరినీ కదిలించింది. నామినేషన్లలో ఉన్న రోహిత్ సేఫ్ అవ్వగా.. చివరికి షాలిని, వర్షిణి మాత్రమే మిగిలారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ నెలకొంది. News18బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం ఎపిసోడ్‌లో రోహిత్, షాలిని మధ్య ఉన్న అనుబంధం అందరినీ కదిలించింది. నామినేషన్లలో ఉన్న రోహిత్ సేఫ్ అవ్వగా.. చివరికి షాలిని, వర్షిణి మాత్రమే మిగిలారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఉత్కంఠ నెలకొంది. చివరకు షాలిని ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. షాలిని తనకు దూరమవుతుందనే బాధను తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు.రోహిత్‌ను అలా చూసిన షాలిని కూడా ఎమోషనల్ అయింది. హౌస్‌లో తనతో కలిసి ప్రయాణించిన రోహిత్‌కు ధైర్యం చెబుతూ కొన్ని మాటలు చెప్పింది. గేమ్‌ను బాగా ఆడాలని, ఎలాగైనా విన్నర్ ట్రోఫీ తీసుకుని రావాలని కోరింది. అంతేకాకుండా రోహిత్‌కు ముద్దుపెట్టి మరీ ‘లవ్ యూ’ అని చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి హైలైట్ అయింది. షాలిని వెళ్లిపోతున్న సమయంలో రోహిత్‌ను హత్తుకుని చాలాసేపు మాట్లాడింది. ఈ ఎమోషనల్ సీన్‌తో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలిని స్టేజీ మీదకు చేరుకుంది. అక్కడ తన జర్నీకి సంబంధించిన ఏవీని చూసి మురిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన క్షణాలు, తోటి కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాలు తెరపై కనిపించడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. తన ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆనందించింది. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా రోహిత్, షాలిని మధ్య ఉన్న బాండింగ్ గురించి మరోసారి ఆసక్తికరమైన చర్చ జరిగింది.తన జర్నీ గురించి మాట్లాడుతూ షాలిని రోహిత్‌ను గుర్తు చేసుకుంది. “నా జర్నీ మొత్తం నువ్వే ఉన్నావ్‌రా. మన జర్నీ చాలా బాగుంది” అంటూ అతడితో చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత ప్రత్యేకమైనదో అర్థమైంది. హౌస్‌లో కలిసి గడిపిన రోజులు, ఒకరికొకరు తోడుగా నిలిచిన సందర్భాలను షాలిని తన మాటల్లో గుర్తు చేసుకుంది.ఆ తర్వాత నాగార్జున మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. షాలిని స్థానంలో ఎవరెవరు ఎలిమినేట్ కావాల్సి ఉందో ముగ్గురి పేర్లు చెప్పాలని కోరారు. దీనికి ఆమె వంశీ, సుధీర్, వర్షిణి పేర్లను చెప్పింది. దీంతో హౌస్‌లోని కంటెస్టెంట్ల పేర్లు మరోసారి చర్చకు వచ్చాయి.అయితే షాలిని హౌస్ నుంచి వెళ్లిపోతుందని అందరూ అనుకుంటున్న సమయంలో నాగార్జున ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. షాలినిని పిలిచి, “నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు.. సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నావ్” అని ప్రకటించారు. దీంతో షాలినికి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా షాక్ తగిలింది. రోహిత్‌కు దూరమవుతున్నానని బాధపడిన షాలిని తిరిగి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందనే ఆసక్తి మొదలైంది. ఇక వచ్చే వారం ఎపిసోడ్‌ను ‘గోట్ - గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అంటూ నాగార్జున పరిచయం చేశారు. మొత్తానికి రోహిత్, షాలిని మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో పాటు సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌తో ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.మరింత చదవండి

Source link