ప్రభన్యూస్

Anirudh-Kavya Marriage: అనిరుధ్- కావ్య మారన్ పెళ్లి.. ఆ జాతకమే నిజం కాబోతోందా? షాకింగ్ వీడియో | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మ్యూజిక్ సెన్సేషన్, ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, నేషనల్ క్రష్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి జాతకానికి సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతోంది.

News18
News18

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, నేషనల్ క్రష్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్ని వారాలుగా వీరి పెళ్లిపై నెట్టింట ఎన్నో ఊహాగానాలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ వార్తలకు అధికారిక ముద్ర పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిన వివాహ ఆహ్వాన పత్రికతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త కన్ఫర్మ్ అయింది.

సన్ గ్రూప్ అధినేత, కావ్య తండ్రి కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్ ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నవంబర్ 21న చెన్నైలో అత్యంత ఘనంగా జరగనున్న కావ్య, అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎంవో అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విఐపి పెళ్ళికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.

ఒకవైపు పెళ్లి వార్త వైరల్ అవుతుండగానే, మరోవైపు పదేళ్ల క్రితం నాటి ఒక పాత వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘తంతి టీవీ’లో ప్రముఖ యాంకర్ అప్సర రెడ్డి హోస్ట్ చేసిన ఒక కార్యక్రమంలో, సెలబ్రిటీ టారో కార్డ్ రీడర్ జయశ్రీ.. అనిరుధ్ భవిష్యత్తు, ఆయనకు కాబోయే భార్య గురించి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఆనాడు ఆమె చెప్పిన ప్రతి అక్షరం ఇప్పుడు కావ్య మారన్ ప్రొఫైల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోలుతుండటం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.

అనిరుధ్ చేసుకోబోయే అమ్మాయి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ లేదా టెలికమ్యూనికేషన్ రంగానికి చెందినదై ఉంటుందని, ఉన్నత చదువులు చదివిన తెలివైన మహిళ అని, వారిద్దరూ ఒక పార్టీలో కలుసుకుంటారని జయశ్రీ అప్పట్లో చెప్పారు. అంతేకాకుండా, ఇద్దరి ఇళ్లు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయని, ఇది పక్కా లవ్ మ్యారేజ్ అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు కావ్య మారన్ నేపథ్యం చూస్తే.. ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోనే ఉన్నారు. లండన్‌లోని ప్రసిద్ధ వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో వీరిద్దరి నివాసాల మధ్య దూరం కూడా చాలా తక్కువే. మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలుతున్న అనిరుధ్, బిజినెస్-స్పోర్ట్స్ రంగాల్లో రాణిస్తున్న కావ్య మారన్ జంట పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావడంతో ఇదొక ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ కపుల్ కావొచ్చు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 12:29 pm Digital Edition : Prabhanews
Anirudh-Kavya Marriage: అనిరుధ్- కావ్య మారన్ పెళ్లి.. ఆ జాతకమే నిజం కాబోతోందా? షాకింగ్ వీడియో | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 11:34 AM ISTమ్యూజిక్ సెన్సేషన్, 'రాక్‌స్టార్' అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, నేషనల్ క్రష్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి జాతకానికి సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. News18సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్, 'రాక్‌స్టార్' అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, నేషనల్ క్రష్ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత కొన్ని వారాలుగా వీరి పెళ్లిపై నెట్టింట ఎన్నో ఊహాగానాలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ వార్తలకు అధికారిక ముద్ర పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిన వివాహ ఆహ్వాన పత్రికతో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త కన్ఫర్మ్ అయింది.సన్ గ్రూప్ అధినేత, కావ్య తండ్రి కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్ ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నవంబర్ 21న చెన్నైలో అత్యంత ఘనంగా జరగనున్న కావ్య, అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎంవో అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విఐపి పెళ్ళికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు సైతం ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.ఒకవైపు పెళ్లి వార్త వైరల్ అవుతుండగానే, మరోవైపు పదేళ్ల క్రితం నాటి ఒక పాత వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'తంతి టీవీ'లో ప్రముఖ యాంకర్ అప్సర రెడ్డి హోస్ట్ చేసిన ఒక కార్యక్రమంలో, సెలబ్రిటీ టారో కార్డ్ రీడర్ జయశ్రీ.. అనిరుధ్ భవిష్యత్తు, ఆయనకు కాబోయే భార్య గురించి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఆనాడు ఆమె చెప్పిన ప్రతి అక్షరం ఇప్పుడు కావ్య మారన్ ప్రొఫైల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోలుతుండటం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది.
Prediction came True... and I'm Still shocked 😮 https://t.co/Zty1JGZGG6
— Sᴀᴛʜ༏sʜ ⚠️ (@Kumar_0305) October 17, 2026అనిరుధ్ చేసుకోబోయే అమ్మాయి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ లేదా టెలికమ్యూనికేషన్ రంగానికి చెందినదై ఉంటుందని, ఉన్నత చదువులు చదివిన తెలివైన మహిళ అని, వారిద్దరూ ఒక పార్టీలో కలుసుకుంటారని జయశ్రీ అప్పట్లో చెప్పారు. అంతేకాకుండా, ఇద్దరి ఇళ్లు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయని, ఇది పక్కా లవ్ మ్యారేజ్ అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు కావ్య మారన్ నేపథ్యం చూస్తే.. ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోనే ఉన్నారు. లండన్‌లోని ప్రసిద్ధ వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో వీరిద్దరి నివాసాల మధ్య దూరం కూడా చాలా తక్కువే. మ్యూజిక్ ఇండస్ట్రీని ఏలుతున్న అనిరుధ్, బిజినెస్-స్పోర్ట్స్ రంగాల్లో రాణిస్తున్న కావ్య మారన్ జంట పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావడంతో ఇదొక 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కపుల్ కావొచ్చు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరింత చదవండి

Source link